Monday, March 10, 2025

గ్రామ సింహాలు /మరో చరిత్ర

అంశం: మరోచరిత్ర


శీర్షిక:  *గ్రామ సింహాలు*

ఈ సృష్టిలో ఎన్ని ఎన్ని చిత్ర విచిత్రాలు
మనిషి మేధస్సుకు అందని
వింతలు విడ్డూరాలు విశ్వ జగత్తులో
అంతు చిక్కని రహస్యాలు ప్రకృతిలో!

ముద్దు ముద్దుగ మూగ జీవాలు
కాదు కాదు అవి గ్రామ సింహాలు
విశ్వాసానికి మరోపేరు
ఎవరైనా వస్తే చేస్తాయి షికారు
కాసింత ఏమైనా పెట్టి
జూలు దువ్వుతే చాలు
ఇక మన వెంటే తిరుగుతాయి!

కాల భైరవుడి వాహనం శునకమని
మనందరికీ తెలిసిన విషయమే
శునకం "కాలజ్ఞాని" అని అనిపించు
మనం ప్రతి రోజూ "బ్రహ్మ ముహూర్తం"
సమయంలో గమనిస్తుంటాను!

ముస్లిములు ఉ: 5.30 - 5.45 మధ్యలో
మైకులో నమాజు చదువుతారు
అదే సమయంలో కుక్కలు అరవడమో
ఏడ్వడమో చేస్తాయి
ఒక్కోసారి నమాజు చదువడం
ఆలస్యం అయితే, శునకాలే అరవడం
ప్రారంభిస్తాయి,
అదే సమయంలో కొద్దిపాటి తేడాతో
నమాజు వినబడుతోంది
ఇప్పుడు నన్ను తొలుస్తున్న సమస్య,
నమాజుకు కుక్కల అరుపులకు
సంబంధం ఏమిటి?
ఇవి అల్లాను ప్రార్ధిస్తున్నాయా లేక
ఇతర దేవుళ్ళను పోటీగా ప్రార్ధిస్తున్నాయా?
లేక ఆ సమయంలో వాటికి
ఎవరు కనబడుతున్నారు?
అంతు చిక్కని ప్రశ్న!

సాధారణంగా యమ భటులు
ఎవరినైతే తీసుకుని పోవాలని వస్తారో
అప్పుడు వాటికి ముందే తెలిసి
ఆ మనిషి చుట్టు పక్కలకు వచ్చి
రోధిస్తుండే విషయం జగమెరిగిన సత్యమే!

ఇన్ని ప్రశ్నలకు సమాధానాల వెతకడానికి
పరిశోధించి డానికి పురికొల్పుతున్న
"గ్రామ సింహాలు" మీక జోహార్లు!

పర్యాయ పదాలు:
గ్రామ సింహాలు - శునకాలు, కుక్కలు
జీవులు  - ప్రాణులు, జీవించు వారు
మేధస్సు- ధారణ శక్తి గల బుద్ది, తెలివి , జ్ఞానం
ప్రార్ధించుట- మొక్కుట, నమస్కరించుట
కాలజ్ఞాని - త్రికాలములు ఎరిగినవాడు, జరుగబోయేదానిని ముందే పసిగట్టే వారు,


No comments: