Friday, March 7, 2025

బాల సాహిత్యం - ఊయల

అంశం: బాల సాహిత్యం - ఊయల


శీర్షిక: ఇరువది ఒకటవ రోజు ఊయల వేడుక

మాయలో నుండి మహిలోకి వచ్చి
అమ్మ మాటలు వింటూ ఆనంద పడుతూ
కూనిరాగాలు తీస్తూ కుదురుగా బజ్జొండి
పసి తనంలో పెదవులపై  పసిడి కురిపించ

ఇరువది ఒకటవ రోజున కొత్తబట్టలు తొడిగి
చేతులకు నల్ల పూసలు కట్టి
దిష్టి తగలకుండా నుదుట కాటుక బొట్టు
అరికాలుకు నలుపు చుక్క బెట్టి
కాలుకు నలుపు దారం కట్టి
ఊయలకు డెకోరేషన్ చేసి
మెత్తటి బట్టలు వేసి ఊయలలో
పదుల చేతులతో ఊయలలో పరుండ బెట్టి
ఊయల క్రింద ఊదు పొగను వేసి
అమ్మానాన్నలు వారికిష్టమైన పేరును
తృష్ణతో పెట్టి పిలువగా
అమ్మమ్మ నానమ్మలు తాతలు తాతమ్మలు
*ఊయలలో వేసి ఉయ్యాలో.. జంపాలా..*
అంటూ  ఊపుతూ పేరుపెట్టి పిలువ
పిల్లలందరు ఆనందంతోకేరింతలు కొడుతారు

పుట్టిన బిడ్డకు *ఊయల* అనేది ఒక వేడుక
ఎవరి శక్తి కొలది వారు జరుపుకుంటారు
కొందరు చీరెలతో జోల కడుతారు
తాళ్ళతో ఊయల కడుతారు మరికొందరు
అమ్మలక్కల పిలుస్తారు స్వీట్లు పంచుతారు
ఉత్సాహభరితంగా ఊయల వేడుక జరుపుతారు

            

No comments: