Friday, March 7, 2025

బహుముఖ ప్రజ్ఞాశాలి మహిళ

శీర్షిక: *బహుముఖ ప్రజ్ఞాశాలి*

గొడుగుకు కప్పు పురుషుడైతే
ఆ గొడుగుకు నిలువెత్తు కుడిభుజం మహిళ 
లోపల చుట్టూరా పుల్లలు,  పిల్లలు వృద్ధులు 
అలా పురుషుడికి తోడుగా ఉంటూ
ఇంటిల్లిపాదికీ రక్షణ కవచం తరుణి!

అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా  

పిన్నిగా అత్తగా స్నేహితురాలిగా
సలహాదారుగా  సేవకురాలిగా 
తన నిండు ప్రేమను సేవలను అందిస్తూ!

అనేక భాద్యతల నెరవేరుస్తూ 
సమయపాలన పాటిస్తూ 
గృహానికి  సి.ఇ.వో. గా బంధాలను
బంధుత్వాలను పటిష్టపరుస్తూ 
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ! 
 
తమ కాయాలను క్రొవ్వొత్తిలా 
కరిగించు కుంటూ వెలుగులు చిందించే 
నిస్వార్ధ జీవులు స్త్రీలు
ఆదర్శనీయులు వనితలు!

నిరంతరం పలు సేవలనందిస్తూ  
సకల సద్గుణాలతో సప్తవర్ణాలతో
చతుష్షష్టి కళలలో ఆరితేరిన
ఆరాధ్య దేవతలు మగువలు!
    
సెలవు లేకుండా  జీతం లేకుండా 
నిత్యం శ్రమిస్తూ జీవితం త్యాగం చేస్తూ
ఒక వైపు వృత్తి బాధ్యతలు
మరో వైపు కుటుంబం కొరకు అలోచిస్తూ
సంసారాన్ని తీర్చి దిద్దే ఏకైక వ్వక్తి తరుణి!

వివిధ రంగాలలో రానిస్తూ 
తమ వంతు పాత్రను పోషించిన
మహిళా మణులు వీర నారీ ఝాన్చి   
రాణి రుద్రమ దేవి,అనీబి సేంట్  దేశ్ ముఖ్  
సేవా రత్న మథర్ థెరిస్సా
భారత రత్న ఇందిరా గాంధీ
క్రీడా కారిణి సింధుజా 
అంతరిక్ష వ్యోమగామి కల్పనా చావ్లా 
సునితా విలియమ్స్ 
గాన కోకిల సుబ్బలక్ష్మి  కేంద్ర ఆర్ధికమంత్రి
నిర్మల సీతా రామన్  మరెందరో!
  
జగతిన లక్షలాది మంది పడతులు
మగవారికి  ధీటుగా వారి ప్రతిభను 
చాటినారూ.. చాటుతున్నారు
మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా
ఎవరికీ తీసి పోరని నిరూపిస్తున్నారు!

ఒక స్త్రీ యెదుగుల వెనుకాల
ఒక మగవాడు ఉన్నట్లే
ఒక పురుషుడి అభివృద్ధి వెనుకాల
ఒక స్త్రీ ఉంటుందనేది జగమెరిగిన సత్యం!

_ మార్గం కృష్ణ మూర్తి 

No comments: