Monday, March 10, 2025

నెచ్చెలి (పదాల కవిత)

అంశం: పదాల కవిత

పదాలు
*తుషారపు వాన*
*విహారపు వీణ*
*మనోహర పల్లవి*
*కాటుక కన్నులతో*

శీర్షిక: *నెచ్చెలి*

అందాల సుందరి అపరంజి బొమ్మ
*తుషారపు వానలో* తుడిచిన నీ ఎదలు
కనువిందు చేస్తుండే , కురులపైన పడిన
మంచు జల్లులు మోముపై కారుచుండే!

తడిచిన ధవళ వస్త్రాలు కుంచించుకు పోయే
చలికి వణికి పోతూ *విహారపు వీణ* లా
ఊగుతూ తూగుతూ చిందులు వేసెదవా
సుగంధాల మకరందాల మందారంలా!

గిర గిర గింగిరులు కొడుతూ
గజగజ వణికి పోతూ వసంతంలో కోకిలలా
*మనోహర పల్లవి* వినిపించెదవా
నా చెలీ నెచ్చెలీ నా అర్ధ నారీశ్వరీ!

*కాటుక కన్నులు* తుంపర వానతో
చెదిరి పోయి నీ ఎద నిండా ఒదిగి పోయే
హంస రెక్కల లాంటి నీ కనురెప్పలు
తళుకు బెళుకులతో చెలిమి కోరు తుండే!

నా మది నిండా నీవే నా హృది నిండా నీవే
కలకాలం తోడుంటానని బాస చేస్తివి
భయమేల నీకు నేనుండ నీ తోడు నీడ
కదలి రావే నా చెలీ నెచ్చెలీ జాగు యేలనే!
         

No comments: