అంశం: చిత్ర కవిత
శీర్షిక: *తెలుగింటి ఆడపడుచు*
*ఇంటిని చూసి ఇల్లాలిని చూడు*
అనేది ఒక నానుడి
ఇక్కడ అలా కాదు
*ఇల్లాలిని చూసి ఇంటిని చూడు*
అన్నట్లుగా ఉంది
బహు సుందరం నీ మోము
కమనీయం నీ అందం
అచ్చ తెలుగు ఆడపడుచులా
ముగ్ధ మనోహరం నీ ఆహార్యం!
కట్టు బొట్టు కనులకు కాటుక
కనువిందు చేయు ఓర చూపులు
చేతులకు గాజులు శిరస్సుపై కొప్పు
కొప్పు చుట్టూ మల్లెపూల దండ!
మెడలో నల్లపూసలు హారం
ఆరు గజాల జరి అంచు చీర
చీర పైన సుందర నగిషీల బిందువులు
చేతిలో తాను రచించిన పుస్తకాలు!
*అన్నం ఉడికిందో తెలుసుకోడానికి*
*కుండెడు అన్నాన్ని పిసుకనవసరం లేదు*
*ఒక్క మెతుకును పిసికితే అర్ధమవుతుంది*
అలానే ఈ తరుణి,
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు
ప్రతిబింబంలా నిండుగా చీరతో
తోటి మహిళలకు ఆదర్శ వంతు రాలిగా
కుటుంబాన్ని తీర్చు దిద్దుతున్న వనిత!
అమ్మగా పిల్లలను ప్రేమతో లాలిస్తూ
గొప్ప ప్రయోజకురాండ్లుగా తీర్చిదిద్దుతూ
భర్తను ప్రేమగా చూస్తూ సక్యతగా నుంటూ
తోడుగా నీడగా సహధర్మచారిణిగా సేవలందిస్తూ
సుగుణవంతురాలిగా తులతూగుతున్న నారి!
అత్తామామలకు అనురాగ కోడలుగా
సపర్యలు చేస్తూ ఇంటి గౌరవాన్ని కాపాడుతూ
ఆడపడుచులను ఆప్యాయంగా పలకరిస్తూ
ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్న కల్పవల్లి!
No comments:
Post a Comment