అంశం: జ్ఞానం
శీర్శిక: *హృదయ విజ్ఞానం*
*భక్తిలేని జ్ఞానం,పునాది లేని ఇల్లు లాంటిది*
జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం
అది లేకుంటే మనుగడ కష్టతరం
అంశంపై ఇష్టం పెంచుకుంటే వస్తుంది జ్ఞానం
జ్ఞానాన్ని పంచుతే పెరుగుతుంది వికాసం!
విజ్ఞానాన్ని సముపార్జించాలి
మంచి పనులు చేస్తూ గడపాలి
కోనేరులా అందుతున్న జ్ఞానాన్ని
ఇతరులకు అందిస్తూనే ఉండాలి!
పుస్తక విజ్ఞానం కంటే మస్తిష్క విజ్ఞానం
మస్తిష్క విజ్ఞానం కంటే *హృదయ విజ్ఞానం*
గొప్పదనుటలో సందేహం లేదు
జ్ఞానం ఒంట బడితేనే సత్యం బోధపడుతుంది!
జ్ఞానం రెండు రకాలుగా ఉండవచ్చు
పూర్వ జన్మ సుకృతం కావచ్చు
సాధన ద్వారా లభించినది కావచ్చు
జ్ఞానమనేది ఎరుక ఉండటం
జ్ఞానం అనగా సత్యాన్ని శోధించడం!
పూర్వ జన్మ సుకృతం అశాశ్వత జ్ఞానం
సాధన ద్వారా లభించినది శాశ్వత జ్ఞానం
పూర్వ జన్మ జ్ఞానుల ఆయుష్షు తక్కువ
సాధన జ్ఞానుల ఆయుష్షు ఎక్కువ!
కన్నులు రెండైన చూపు ఒక్కటే
మాటలు ఎన్నెనా మనసు ఒక్కటే
మతాలు ఎన్నైనా మోక్షం ఒక్కటే
చదువులు ఏవైనా జ్ఞానం ఒక్కటే!
కనిపించే వాస్తవం గురించి
తెలుసుకోవాలంటే శాస్త్ర జ్ఞానం కావాలి
కనిపించని వాస్తవం గురించి
తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి
ఏది కావాలన్నా నిత్య సాధన చేయాలి!
No comments:
Post a Comment