Sunday, March 9, 2025

ప్రకృతి విపత్తులు - రైతుల బాధలు

అంశం: *ప్రకృతి విపత్తులు, రైతుల బాధలు*


శీర్షిక: కర్షక కౌలుదారుల శ్రమను గుర్తించాలి 

ఒక వైపు ప్రకృతి విపత్తులు
మరోవైపు దళారుల అరాచకాలు
గ్రోలుచుండే కర్షక చెమటను
దోచుతుండే దేశ సంపదను
ఇక ఎప్పుడు మారుతాయి
రైతన్నల బ్రతుకులు!

నేడు రాష్ట్రాలలో , దేశంలో
అన్యాయాలు , అక్రమాలు తాండవిస్తున్నాయి
బానీసలను చేసే ఉచిత పధకాలు
పెరిగి పోతున్నాయి
ప్రజలను సోమరులను చేసే
కొత్త విధానాలు తన్నుకు వస్తున్నాయి!


ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ
నేతలు , వారి తొత్తులు వ్యాపారులు
రాష్ట్రాలలో, దేశంలో అప్పులు పెంచుతూ
ఓటు బ్యాంకు పధకాలకు
నోట్లను పంచ దిగనుండే !

కులాలను , మతాలను విడదీస్తూ
కొత్త కొత్త పధకాలు
ఓటు బ్యాంకు టికాణాలు
కాకమ్మ కథలు, వినూతన దోపిడీలు!

వ్యవస్థలను చైతన్య పరుచాలి
ఎన్నికల సంస్కరణలు జరుగాలి
ఓటు బ్యాంక్ పధకాల నియంత్రించాలి
రిజర్వేషన్ల క్రమ బద్దీకరించాలి!

నేతలకు పెన్సన్లు రద్దు చేయాలి
నేతలకు ఆదాయ పన్నులు వేయాలి
భూస్వాములకు రైతు బంధు రద్దు చేయాలి
రైతన్నలను జీవింప చేయాలి
*కర్షక కౌలుదారుల శ్రమను గుర్తించాలి!*






No comments: