Monday, March 10, 2025

అమ్మకు, ఆలికి పోలికెక్కడ?

శీర్షిక: అమ్మకు , ఆలికి పోలికెక్కడ?


క్షమించాలి. ఇది కేవలం అక్కడక్కడ కనిపించే కొందరు , అర్ధాంగినులను ఉద్దేశించి మాత్రమే వ్రాయడం జరిగింది. వాస్తవానికి , భర్తలను ప్రేమగా, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నవారు మరియు జేబు కాకుండా కడుపును చూసే అర్ధాంగినులు కూడా ఉన్నారు.
అలానే పిల్లల బాధ్యతలను గాలికి వదిలేస్తూ , స్వార్థంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో , జీవిస్తున్న తల్లులు కూడా ఉన్నారు.
మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. వీడియో ను లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. మరియు బెల్ ఐకాన్ ను ఆక్టివేట్ చేసుకోగలరు. అలానే తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించగలరు.

రాపిడి నుండే
పుడుతుంది నిప్పు
గాయం నుండే
కారుతుంది రుధిరం
భూమి నుండే
మొలకెత్తుతుంది మొక్క
కడలి నుండే
ఎగిసి పడుతుంది కెరటం
సమాజం నుండే
ఉబికి వస్తుంది
కవిత్వం!

నవ మాసాలు
మోసి
కనీ, పెంచీ
పెద్ద చేసి
విద్యా బుద్ధులు
నేర్పించేది
జీవన గమనం
చూపించేది
జీవిత లక్ష్యం
ఏర్పరిచేది
జీవిత
గమ్యానికి
చేర్చేది అమ్మ !

వడ్డించిన
విస్తరులో
భోజనాన్ని
ఆరగించడానికో
ఆభరణాలను
వేసుకోడానికో
ఆహార్యాన్ని
చూపడానికో
ఆహ్లాదాన్ని
పంచడానికో
విషాదాన్ని
నింపడానికో
ఎంటర్టైన్మెంట్
చేయడానికో
పెళ్లి అనే ముసుగులో
సహజీవనం
చేయడానికో
ఒకరికి
జన్మ నివ్వడానికో
డామినేషన్ చూపడానికో
వచ్చేది ఆలి !

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!


నిత్యం
కొడుకు
కడుపు
చూసేది
కడుపు నింపేది అమ్మ !

ప్రతినిత్యం
భర్త
జేబు
చూసేది
జేబు ఖాళీ చేసేది ఆలి !

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

చెప్పిన మాట
వినకుంటే
చేయి చేసుకునైనా
మంచి దారిన
నడిపిస్తుంది అమ్మ!

ప్రశ్నించినా
విమర్శించినా
నొచ్చుకోకుండా
అర్ధం చేపిస్తుంది అమ్మ!

చెప్పిన
మాట వింటే
నచ్చినట్లు
నడుచుకుంటూ
మెచ్చు కుంటే
పడి ఉండమంటుది ఆలి!

ప్రశ్నిస్తే
విమర్శిస్తే
కసురుకుంటుంది
గుచ్చుకుంటుంది ఆలి!


అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

ఏవో కొన్ని
కుటుంబాలలో
తల్లులు
స్వార్థంతో ,
అమాయకత్వంతో ,
అజ్ఞానంతో
ఉండవచ్చు
అయినా
తల్లి కాకుండా పోతుందా!

ఏవో కొన్ని
కుటుంబాలలో
భార్యలు
భర్తలను
ప్రేమగా
చూస్తుండ వచ్చు!

మరికొన్ని
కుటుంబాలలో
జీవితం
అర్ధమయ్యాక
అమ్మలు, అర్ధాంగులు
ప్రేమగా చూడ వచ్చు!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

అధిక
కుటుంబాలలో
అమ్మ పానకం
తాగిస్తే
భార్య నరకం
చూపిస్తుంది


తాము బ్రతికి
ఉన్నంత కాలం
కంటికి రెప్పలా
కాపాడుతారు
ప్రేమను పంచుతారు
కొందరు తల్లులు!

భర్త
ఎప్పుడు
పోతాడా
అడ్డులేకుండా
హాయిగా, ఆనందంగా
స్వేచ్ఛగా
జీవిద్దమా అని
ఎదురు చూస్తారు
కొందరు భార్యలు!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

నేటి ఆలి
రేపు
మరొకరికి
అమ్మే
అయినా
బొడ్డు త్రాడుపై
ఉన్న ప్రేమ
పసుపు త్రాడు పై
ఎందుకుంటుంది?

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

అమ్మ
పక్కింటి
వారిని కూడా
కలుపుకుని
పోతుంది
కానీ ఆలి
స్వేచ్ఛ కొరకు
తన మెట్టినింటి
వారిని మొదట్లోనే
తుంచి వేస్తుంది!

పక్కింటోల్లు
పందిరేసుకున్నారు
ఎదురింటి వారు
కారు కొన్నారు
ఇటు ప్రక్క వారు
ఇల్లు కొన్నారు
అది కావాలి
ఇది కావాలి
పెళ్లి
ఎందుకు చేసుకున్నావు
ఏమి చేస్తావో
నాకు తెలియదంటూ
రాచి రంపాన
పెడుతారు భార్యలు!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

కాలికి
ముల్లు గుచ్చినా
కంట్లో నలుసు పడినా
చేతికి గాయమైనా
అమ్మా అనే అంటాం
కష్టం వచ్చినా
నష్టం వచ్చినా
అమ్మనే తలుస్తాం!

నవ మాసాలు మోసి
కని పెంచిన
అమ్మకు
హక్కులు లేవట
కొడుకుపై


నాలుగేళ్ల క్రితం
మూడు ముళ్లు
వేయించుకున్న
భార్యకు
హక్కులుంటాయట
భర్తపై

అయినా
అసలు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

మంచిదైనా
కుంటిదైనా
గూనిదైనా
పిచ్చిదైనా
పేదరాలైనా
కూలి పనులు చేసినా
వృద్దు రాలైనా
అమ్మ , అమ్మే!

అందంగా ఉన్నా
వయ్యారాలు ఒలకబోసినా
విద్యావంతురాలైనా
ఉద్యోగాలు చేసినా
ధనవంతుల కూతురైనా
మాటకారి అయినా
మాయలాడి అయినా
ఆలి ,ఆలే!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!


కొడుకులు బిడ్డలు
బుద్ధి మంతులు కావాలని
మంచి పేరు
తెచ్చుకోవాలని
సుఖంగా, సంతోషంగా
నిండు నూరేళ్ళు
చల్లగా జీవించాలని
కోరుకుంటుంది అమ్మ !

భర్త ఎప్పుడు
బకీట తంతాడా
టెన్సన్ లేకుండా
పెన్షన్ తీసుకోవచ్చనీ
ఇన్సూరెన్స్
ఆస్తులను అనుభవిస్తూ
స్వేచ్ఛగా
ఒంటరిగా
జీవించాలని
ముందు నుండే
ప్లానులు వేస్తుంది భార్య!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!


బిడ్డను
కన్న
పేగుకు
అమ్మకు

భర్తైన
పరాయింటి
పసుపు త్రాడుకు
ఆలికి
ఎంతో భేదం ఉంటుంది !

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ !

అమాయకపు తల్లిని
అనుభవం గల తల్లిని
వృద్ధురాలైన తల్లిని
కుంటిదైన తల్లిని
గూనిదైన తల్లిని
అమ్మే కాదనుట హేయం!

మాటకారి  ఆలిని
మాయలాడి ఆలిని
పాశ్చాత్య పోకడల ఆలిని
మెట్టినింటి వారిని
దూరం పెట్టే ఆలిని
నరకం చూపించే ఆలిని
భార్య అనుట హీనం!

అయినా
నేడు అమ్మకు
ఆలికి
పోలికెక్కడ!

పాకి పనులు చేసి
నూనె బుట్టలు మోసి
మట్టి తట్టలు మోసి
ఇంటింటా బాసాన్లు తోమి
బిక్షాటన చేసి
బిడ్డలను పోషించినా
తల్లి తల్లే అవుతుంది!


ఇప్పుడైనా
ఎప్పుడైనా
ఎప్పటికైనా
అమ్మ స్థానం
అమ్మదే
ఆలి స్థానం
ఆలిదే

అదే
సంసార బంధం!
అదే
జీవన మకరందం!

No comments: