*అంశం: కవిత పూరించండి*
*శీర్షిక: సంసార నావ*
*పెరిగే ధరల మోతలో*
*చాలిచాలని జీతంతో*
*సంసార నావను తీరం చేర్చడంలో*
*గుండె గూటికి ఎన్ని*
*దెబ్బలో*
*నేటి సగటు మనిషికి..!*
కాలాలు మారినా ప్రభుత్వాలు మారినా
పాలకులు వారే ఉంటారు
కొత్తసీసాలలో పాత బీరులా
అవినీతి నాయకులు స్వార్ధ నాయకులు
పాలిస్తున్నపుడు ధరలను అదుపుచేయరు
అందుకు *పెరిగే ధరల మోతలో* జనులు
ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు
ప్రపంచీకరణ కారణంగా
కార్మిక చట్టాలు నీరుగారిపోయాయి
పని గంటలు పెరిగాయి
వచ్చే *చాలీ చాలని జీతంతో* జీవితం
గడపడం దుర్లభం అవుతుంది
పిల్లల ఫీజులు ఇంటి అద్దెలు
అనారోగ్యం సమస్యలు ఇంటి గాసం
మొదలగు కారణాల వలన
*సంసార నావను తీరం చేర్చడంలో*
విఫలమవుతున్నారు
ఖర్చులు సమస్యలు అనేక ఆలోచనలతో
నిత్యం *గుండె గూటికి ఎన్ని* పోట్లో
మరెన్ని పాట్లు చెప్ప నలవి కాదు
పిల్లల పెండ్లిళ్ళు, అనుకోని ఖర్చులు
నష్టాలు ఎన్ని *దెబ్బలో* ఎన్ని బాధలో
అప్పులు వడ్డీలు స్కాములు
తప్పించుకున వీలుగాని స్యూరిటీలు
ఎన్ని కష్టాలో. *నేటి సగటు మనిషికి*!
No comments:
Post a Comment