అంశం: అణిచివేత
శీర్శిక: *తిరుగ బడితే*నలిగి మెలిగే వారున్నంత కాలం
నలిపి అణిచి వేసే వారుంటారు
బలహినులున్నంత కాలం
బలవంతులు ఉంటారు
తిరుగ బడితే తోక ముడుస్తారు!
అణిచివేత అనేది
ఆది కాలం నుండి వస్తున్నదే
ఇదేమీ వింతైన పదము కాదు
వినూతమైన దృశ్యకావ్యము కాదు!
చీకటికి మనిషి భయపడుతాడు
వెలుతురుకు ధైర్యంగా ఉంటాడు
చీకటిని ఛేదించాలి
వెలుగును ఆహ్వానించాలి
అణిచి వేస్తావో అణిచి వేయబడుతావో
అంతా నీ చేతిలోనే!
నిరక్షరాస్యత అజ్ఞానం పేద తనం
అనారోగ్యం అంగ వైకల్యం అస్పృశ్యత
పిరికి తనం మానవుల బలహీనతలు
అక్షరాస్యత విజ్ఞానం ధనికత్వం
ఆరోగ్యం బుజబలం తెలివితేటలు
ధైర్యం మానవుల బలాలు!
బలహీనతలను తగ్గించుకుంటూ
బలాలను పెంచుకుంటూ
ఎదిరించి తిరుగబడితే
నిప్పు కణాలను కురిపిస్తే
అణిచివేత మంచులా కరిగిపోతుంది
మహారాజులా జగతిలో వెలుగొందుతారు!
No comments:
Post a Comment