అంశం: ఘంటసాల
శీర్శిక: *గంభీర కంఠ స్వర గాయకుడు ఘంటసాల*
*ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం*
*ఎంత కాలం బ్రతికాం అన్నది కాదు*
*ఎలా గుర్తింప బడినాం అనేది ముఖ్యం*
*బురుదలో పుట్టిన తామర*
*చివరికి చేరుతుంది విష్ణువు పాదాల చెంతకు*
*తక్కువ కాలమే జీవించినా*
*గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించి, చరిత్రలో*
*సుస్థిర స్థానాన్ని సంపాదించిన వారెందరో*
*అలానే వారి మంచి ప్రతిభతో గుర్తింపు పొందిన వారెందరో*
స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, చక్రి, సావిత్రి, బాలసుబ్రహ్మణ్యం
ఇలా ఎందరో
*ఘంటసాల*
ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని
కృష్ణా జిల్లా మారుమూల గ్రామంలో
పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించినా
అష్ట కష్టాలు అనుభవించినా
తన తండ్రి పిన్న వయసులో మరణించినా
తాను తన శ్వశక్తితో ఎదిగారు
తన గంభీర కంఠ స్వరంతో గుర్తింప పొందారు
చివరి దశలో భగవద్గీత పారాయణంతో
భారత దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు
గాయకుడు, సంగీత దర్శకుడు
వేలాది పాటలు పాడి ప్రజల హృదయాలలో
స్థిర స్థాయిగా నిలిచి పోయారు
పందొమ్మిది వందల డెబ్బై లో కేంద్ర ప్రభుత్వంచే
*పద్మశ్రీ అవార్డు* పొందారు
పందొమ్మిది వందల డెబ్బై నాలుగులో
విష్ణైక్యమయ్యారు
No comments:
Post a Comment