Wednesday, April 9, 2025

ముక్తప్రదగ్రస్త అలంకారాలు

అంశం: కలం స్నేహం ఫ్యామిలీ 


శీర్షిక: నయాగరా జలపాతాలు (ముక్తాప్రదగ్రస్త అలంకారాలు)

అదిగదిగో అందమైన సుందర నయాగరా *జలపాతాలు* 

*జలపాతాల* జలం చేరుతుంటాయి చేరువలోని *నదికి* 


*నదిలో* జల పుష్పాలు చంద్ర వంకలా ఎగిరెగిరి పడును *నదిలో*

*నది* ప్రక్కనే ఒంటి కాలిమీద ధ్యానం చేస్తున్నట్టు నటిస్తాయి కొంగ భామలు అదను కోసం *నదిలో*


*నదిలో* అక్కడక్కడా ఉన్నాయి మనోహరమైన *కమలాలు* 

*కమలాలు* అంటే విష్ణువుకు *మహా ప్రీతి* 

*మహా ప్రీతి*  వలన తామరలకు గొప్ప *పేరు వచ్చింది* 

*పేరు వచ్చింది* కానీ రోజు రోజుకు కమల పుష్పాలు హంసలలా రాబోయే కాలంలో అందని *ద్రాక్షే*


*ద్రాక్ష* పళ్ళు విత్తనం లేని అంగూరాలు చాలా *తీపి* 

*తీపి* అంగూర్ పండ్లంటే జనులకు చాలా చాలా *ఇష్టం* 

*ఇష్టమైన* అంగూర్ ద్రాక్ష పండ్లు వేసవి కాలంలో 

అధికంగా *పండును* 

*పండిన* ద్రాక్ష అంగూర్ పండ్లను పులియబెట్టి బ్రాండి విస్కీ బీర్లను *తయారు చేస్తారు* 

*తయారు చేసిన* బ్రాండి, విస్కీ బీర్లను దేశంలో అమ్ముతారు విదేశాలకూ ఎక్స్ పోర్ట్ చేస్తారు!!

మా ఊరు (వచన కవిత)

*నేటి అంశం : *మా ఊరు*


శీర్షిక: మా ఊరు 

పచ్చని పొలాలు పారేటి వాగులు
ఎత్తైన వృక్షాలు యెటను జూడ
మట్టి గోడలయిండ్లు మానవీయ జనులు
కష్టించు కార్మిక కర్షకులును
కలివిడి మనుషులు కమనీయ మమతలు
పంటలు పండించు గుంట భూమి 
పండుగ లొచ్చిన పరవసమొందేరు
కష్టాలు వచ్చిన కలిసి యుంద్రు!

సూరిపెల్లి మాది చురుకైన యువకులు 
ఊరు చిన్న దైన జోరు కల్లు 
చుట్టు చెరువులుండు చెట్టుపుట్టలు నుండు
ఓరుగల్లు జిల్ల పోరునెల్ల!

పల్లెల భూముల్లొ పండించు రైతులు
పాడిపంటలు చాల పల్లెలందు
కాయగూరలుతాజ కందాయ ఫలములు 
పుష్టిగ పండును పురముబంప 
శ్రమకోర్చు యువకులు శక్తినింపుకొనియు
సిద్ధము నుందురు సేద్యమునకు 
పల్లెసీమలుదేశ పట్టుగొమ్మలు నేడు 
సాధించ వలయును జగతి నంత!

ప్రకృతి తాండ వించు పల్లెసీమల నందు
స్వచ్ఛ గాలి యుండు జలము నిండు 
అలసట మరిచేరు హాయిగా నుండేరు 
పేద రికములైన పెద్ద మనసు!

*మార్గం కృష్ణ మూర్తి*

ఆది లోనే హంస పాదు

అంశం: సంకేతం


శీర్షిక: *ఆది లోనే హంస పాదు*

తరిగే అందాన్ని ఎవరూ దాపలేరు
పెరిగే వయసును ఎవరూ ఆపలేరు
చంచల మనసును ఎవరూ చూడలేరు
నిప్పులాంటి నిజాలను ఎవరూ దాచలేరు!

మండే ఎండలను ఆపగలమా
నిలకడగా ఉన్న భూమి రేట్లను దాపగలమా
పెరిగే బంగారం ధరలను నిలువరించ గలమా
చెరువుల్లో తరిగే నీటిని అడ్డుకో గలమా!

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది
విశ్వా వసు నామ సంవత్సరం దేనికి సంకేతం
ఆది లోనే హంస పాదు అన్నట్లు
పెద్దన్న దెబ్బకు దేశాలు గొల్లుమంటున్నయి
ఆర్ధిక వ్యవస్థకు మూల స్థంభమైన
షేర్ మార్కెట్ ను మూచ్యువల్ ఫండ్స్
అతలా కుతలమవుతున్నయి!

స్థిరంగా ఆదాయం వచ్చే వేతన జీవులు
ఉచితాల పైననే జీవించే నిరు పేదలు
ఎలాగో అలాగూ నెట్టుక రావచ్చు
అటు ఇటు గాని మధ్య తరగతి ప్రజలు
అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు!

చాప కింద నీరులా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
ఊడి పోతున్నాయి
గుట్టు చప్పుడు కాకుండా కర్మాగారాలు
మూతపడుతున్నాయి!

*విశ్వా వసు* పేరు లోనే ఉంది నమ్మకమని
అతి విశ్వాసం కూడా అనర్ధ దాయకమేమో
ప్రజల ప్రబల నమ్మకాన్ని వమ్ము చేస్తుందా
లేక దుమ్ము లేపుతుందా వేచి చూడాల్సిందే!
ఆశావహ దృక్పథానికైనా ఒక హద్దు ఉండాలి
అంతరాత్మను ఎంత కాలం వంచిద్దాం!
ఏది ఏమైనా
*విశ్వా వసు* నామ సంవత్సర ఉగాది
దేశ ప్రజలకు సకల సంపదలు
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
అందించాలని మనసా వాచా కర్మణా
కోరుకుందాం!

వివాహ బంధం సాఫీగా కొనసాగాలంటే

అంశం: కలి విడి


శీర్శిక: వివాహ బంధం సాఫీగా కొనసాగాలంటే..

*కలిసి ఉంటే కలదు సుఖం*
*విడి పోతే మిగులును దుఃఖం*

కట్టెలు  *మోపుగా* ఉంటే విరువడం కష్టం
అవే *విడి విడిగా* ఉంటే విరువడం తేలిక

ఒకరి కొకరు తోడుగా ఉంటే ఎంతో బలం
ఒంటరిగా ఉంటే నెరవేరు ఎదుటి వారి పంతం
ఎప్పుడూ ప్రయత్నించకు ఉండాలని ఏకాంతం
కలిసి మెలిసి ప్రేమగా గడుపు జీవితాంతం!

నాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి
అందరూ కలిసి మెలిసి జీవించే వారు
ఏ పని అయినా కలిసి చేసుకునే వారు
కష్ట సుఖాలు అందరూ పంచుకునేవారు
ఆనందంగా హాయిగా జీవించే వారు!

నేడు  న్యూక్లియర్ ఫ్యామిలీలు
భయం భక్తి పెద్దలంటే గౌరవం జాలి దయా
సంస్కారం సభ్యత ఎక్కడా కానరాదు
ఎప్పుడూ ఇగోలతో జీవితం సాగిస్తున్నారు!

విచ్చల విడి తనం పెరుగుతుంది
కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా
పెద్దల సపోర్ట్ లేక అహాలతో
విడి పోవడానికే ప్రయత్నిస్తున్నారు!

ఏ వివాహ బంధమైనా పచ్చని తోరణంలా
కలకాలం పచ్చగా వర్ధిల్లాలంటే
రెండే రెండింటినీ ఉభయులు పాటించాలి
అవి ఒకటి *సహనం* రెండవది *సర్దుబాటు*!


Tuesday, April 8, 2025

సైన్స్ అందని సత్యం

 శీర్షిక: *సైన్సుకు అందని సత్యం*


వినీలాకాశంలో నక్షత్రాలు 

పరుగులు పెడుతున్నాయి 

అవనిలో అంధకారం అలుముకుంది

విశ్వం నిశ్శబ్దం ఆవహించింది

పండు అమావాస్య రోజు

జనులు పశు పక్షాదులు

నిద్రలోకి జారుకున్నాయి

రాత్రి సూరీడు వచ్చేవేళ 

దగ్గర బడుతుంది


రాజు తమ వాహనాలకు

వార్తను అందించారు 

అవి ఆ ఇంటి దగ్గరలో 

దక్షణం వైపున కూర్చుని 

బోరుమని రోధనలు చేస్తున్నాయి


ఏమి జరుగుతుందో 

యేమి జరుగబోతుందో 

ఎవరికీ తెలియని 

అయోమయ పరిస్థితి 


రాజు  ఆజ్ఞ మేరకు

కత్తులు కఠారులు పట్టుకుని 

త్రాళ్ళు పలుగులు పుచ్చుకుని

దక్షణం నుండి భటులు వచ్చారు

ఆ భటులు ఎవరో కాదు, యమ దూతలు 


వచ్చిన విషయాన్ని చెప్పారు 

మర్యాదగ వస్తావా  లేక 

మమ్మల్ని ఎత్తుకు పొమ్మంటావా 

అని గద్ధించారు 


అంతే, 

ఆ తల్లి ఎవర్రా మీరు అంటూ

కాళికా దేవిలా గర్జించింది

బడితే చేతిలో బుచ్చుకుంది 

నాకు ఇంకా బ్రతకాలని ఉందిరా 

నా ఇల్లును ఇంకా అమ్మలేదురా 

నాకు ఇంకా ఎన్నో పనులున్నాయిరా 

అంటూ తరిమి తరిమి కొట్టింది 

ఒక్కసారే, అమ్మ వారిలా

విశ్వరూపం చూసేసరికి 

యమదూతలకు బయం వేసి

వినేటట్లు లేదని , చేసేది ఏమీ లేక 

వెంట తెచ్చుకున్న  అస్త్ర శస్త్రాలతో

యమధర్మరాజు వద్దకు బయలు దేరారు 


గెలిచిన విజయోత్సాహంతో 

ఆ తల్లి అదే నిండు నిశి వేళ 

స్నానం గావించి

ఆనందంగా నిదురలోకి జారుకుంది


మరికొన్నాళ్లకు 

ప్రతి రోజు పగలు కొడుకు కోడలుతో

సేవలు చేయించు కోవడం 

రాత్రి వేళల్లో తన వారిని 

అమ్మ అక్క మనుమరాలా 

అంటూ పిలవడం

తమ్ముళ్ళను, మరుదండ్లను 

తలుచుకోవడం 

వారు స్వర్గం నుండో నరకం నుండో

ఆ తల్లి వద్దకు రావడం

వారితో చిన్న నాటి సంఘటనలు

బాధలు చెప్పడం, వారు చెప్పేది వినడం 

నిత్య కృత్యంగా మారింది


పొద్దస్తమానం వారితోనే 

ముచ్చట్లు అచ్చట్లు 

చీదరింపులు బెదిరింపులు

తిట్ల పురాణాలు 

అప్పుడే, ప్రేమలు గార్వాలు, 

అలకలు ఊరడింపులు 


పాలు పోస్తుంటే 

భోజనం వడ్డిస్తుంటే

తన వారికి పెట్టమని

బ్రతిమి లాడుతుంది

ఇప్పటికీ అమ్మన్నా, అక్కన్నా

తన వారన్నా ఎంత ప్రేమో !


ఏరి వారు అని గట్టిగా ప్రశ్నిస్తే 

ఇదుగో ఇప్పుడు ఇక్కడే ఉండిరి బిడ్డా

అని అంటుంది

సరే అని కొడుకు, నేను తీసుకెలుతున్నాను 

మీ అమ్మకు బయట భోజనం పెడుతాను అంటే 

చిన్న పిల్లలా ఇక తీసుకపోతవులే అంటూ

ముసిముసి నవ్వులు నవ్వుతుంది 


ఆ తల్లి తిన్నా తినకున్నా 

తనకు పెట్టిన అన్నంలో

కొంత తీసి అమ్మా అమ్మా అంటూ 

అక్కా అక్కా అంటూ

పిలిచి వారికి వేరే రికాపులో పెడుతుంది


పన్నా పడుకోకున్నా , 

ఓ మూలకు పడుకుని

తన మంచం పైన చోటిచ్చి 

బ్లాంకెట్ వారికి నిండుగా కప్పుతుంది 

చాలామంది వస్తె వారికి చాప వేస్తుంది


తెల్లవారు కొడుకు కోడలు చూస్తే 

మరో రికాపులో అన్నం దర్శనం 

ఇదేమిటంటే, వాల్లకు గర్ర వచ్చింది

తినలేదు బయట పారేయంటుంది 


తెల్లవారేసరికి, నిద్ర మబ్బు వదలగానే

బయటకు వచ్చి వారు ఏరిరా,

మా అమ్మ పిల్లలు ఏరిరా అంటుంది


నిత్యం ఇదే తంతు 

ప్రతినిత్యం ఒక వింత దృశ్యం 

ఎవరికీ అంతుచిక్కని చిత్రం

అంతా సృష్టి మహత్యం

సైన్సుకు అందని సత్యం 

సిల్వర్ లైన్ కలిసి ఉండటం వలన

సగం భువిలో, సగం దివిలో

గడిపే ఆ నూరేళ్ళ తల్లి 

మరో నూరేళ్ళు జీవించాలని

కోరుకుందాం


అతి స్నేహం అమృతం - విషం

అంశం: *పవిత్ర స్నేహం*

శీర్షిక: *అతి స్నేహం అమృతం - విషం*


స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక

స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక

స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక

స్నేహమంటే ఒక గౌరవం, ఒక నమ్మకం!


స్నేహమంటే ఒక ధైర్యం

స్నేహమంటే ఒక అవసరం

స్నేహమంటే ఒక భాద్యత

స్నేహమంటే ఒక ఆనందం!


కవిత వేరు కథ వేరు

సినిమా వేరు జీవితం వేరు

ఒప్పందం వేరు స్నేహం వేరు

ద్వాపర యుగం వేరు కలియుగం వేరు

ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు

కలియుగంలో ఇద్దరి మనుష్యుల స్నేహంవేరు!


స్నేహం అమృతం , విషం

అతి స్నేహం అనర్ధ దాయకం

గుడ్డి  స్నేహం  ప్రమాదకరం

అతి విశ్వాసం తో జీవిస్తే మిగిలేది శూన్యం!


స్నేహమని చెప్పి కుటుంభాల

కూల్చిన వారు లక్షలు

హత్యలు చేసిన వారు వేలు

మోసాలు చేసిన వారు కోకొల్లలు

స్నేహం ఎంత వరకు ఉండాలో

అంత వరకే ఉండాలి

స్నేహం కనబడని కత్తి లాంటిది

ఇద్దరి పరిపక్వ మనసుల కలియికలు

పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు

 ప్రపంచ పర్యావరణ దినము పురష్కరించుకుని 

కవితల పోటీ కొరకు,

అంశం: *పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు*


శీర్షిక : *వృక్షోరక్షతి రక్షితః*


పచ్చ పచ్చని  తరువులతో

చల చల్లని మారుతాలతో

పక్షుల కిల కిలా రావాలతో

పరవశించు పర్యావరణం!


నేడు మనిషిలో  స్వార్ధం పెర్గి పోయే

చెట్టు పుట్టా త్రవ్వే , గుట్టల గనుల కొల్లగొట్టి

పరిశ్రమల స్థాపించే, కార్భన్ల గాలిలో వదిలి

పర్యావరణాన్ని  పాడు చేసే


బీడు వారిన నేలలతో

విశ్వం నిండిన కార్బన్స్ తో ,

అంతరించిన ఆక్సిజన్ తో

ఊపిరాడక లేక జనులు, అశువులు బాసే


చెట్టు గుణము నుండదు ,చెట్టంత మనిషికి

బ్రతికినన్ని రోజులు, చెట్లు ఆరోగ్యాన్నిచ్చు 

వర్షముల కురిపించు , ఔషదాల నిచ్చు

*పచ్చని చెట్లే , ప్రగతికి మెట్లు*


*మార్గం కృష్ణ మూర్తి*

డాక్టర్ అంబేద్కర్ ( సీ.ప)

 డాక్టర్ అంబేద్కర్ 

సీ.

రాజ్యాంగ రచనను రయముగనెంచియు   
నేతలు దేశాధి  నేత లెల్ల
సంప్రదించదలచి  సహకరించమనగా    
ఎన్నియో దేశాల  యెన్ని యెన్నొ
రాజ్యాంగనమునాల  రాజ్యాధి నేతలు
ఇవ్వగ  కమిటీని  నిక్కడేసి  
అందరి సలహాతొ  నంబేద్కరుడొకడే
రచియించె రాజ్యాంగ  రచననంత
 
ఆ .వె :
నాటి చట్ట ములను  నాయకులెల్లరు  
దిద్దు బాటు చేసి దినము దినము
నరుల సంపదలను నారగిస్తుయునుండె
రాజకీయు లెల్ల రాటుదేలె!


శృతి మించితే

అంశం: కొత్త లయ



శీర్షిక: *శృతి మించితే*

*పాత ఒక రోత కొత్త ఒక వింత* అన్నట్లు
కొత్త లయ వచ్చినపుడు
పాత లయ రోతగనే కనబడుతుంది
వింతే కదూ...

కొత్త లయ గాలి పటమైతే
దానికి ఆధారం దారం పాత లయే
దారం లేకుండా పతంగి ఎగరనట్లే
పాత లయ లేకుండా కొత్త లయ
మనుగడ సాగించడం అసాధ్యం!

శృతి మించితే లయ తప్పుతుందన్నట్లు
ఏదీ అతి పనికి రాదు ఆవేశం పనికి రాదు
జీవితం లయ తప్పకుండా ఉండాలంటే
స్థిత ప్రజ్ఞత ఆత్మ నిగ్రహం ఎంతో ముఖ్యం!

జీవితంలో శృతి లయలు అన్నీ సహజమే
మానవుడి జీవితం ఉత్కృష్టమైనది
ఏది మంచి ఏది చెడు అనేది
హంస నీటిని పాలను వేరుచేసి నట్లుగా
విభజించి మంచిని స్వీకరించి
చెడును త్యధించడం విజ్ఞుడి లక్షణం!

వృద్ధాప్య దశ

అంశం:ఒంటరి తనం


శీర్షిక: వృద్ధాప్య దశ

మనిషి ఎదుగు తుంటే ఒదిగి ఉండాలి
వయసు పెరుగుతుంటే అనిగి ఉండాలి
ఒంటరి తనాన్ని /వృద్ధాప్యాన్ని
ఎవరూ తప్పించు కోలేరు!

వృద్ధాప్య దశలో చేతిలో అధికారం ఉండదు
చేతిలో డబ్బూ , హోదా ఉండదు
ఉన్నా  వారు బ్యాంకుకూ వెళ్ళలేరు
ఉన్నా కొందరు సంపద అనుభవించలేరు
చెబుతే వినే వారు ఎవరూ ఉండరు
గౌరవించే వారు దరిదాపున కనబడరు!

కోపాలు ,తాపాలు , అహం ఈర్ష్య అసూయ 
స్వార్ధం , నియంతృత్వం  విడనాాలి
అడుగ కుండా సలహాలు ఎవరికీ ఇవ్వకూడదు
చాడీలు ,విమర్శలు చేయకూడదు!

అందరితో కలుపు గోలుగా మెలగాలి
ఏదో ఒక మంచి వ్యాపకంలో సేద తీరాలి
అవకాశముంటే దాన ధర్మాలు చేయవచ్చు
చేతనైతే సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు
*ఒంటరి తనాన్ని జయించడానికి*
*ప్రశాంత ఒక్కటే మార్గం*

సంస్కారం - సభ్యత

*అంశం సంస్కారం-సభ్యత*


శీర్షిక: సంస్కారం - సభ్యత వెలకట్టలేని సంపదలు

*ప్రపంచంలో సంస్కృతి సాంప్రదాయాలకు* *పుట్టినిల్లు ఏకైక దేశం భారత దేశం*
*సంస్కారం సభ్యత వెలకట్టలేని సంపదలు*
*అవి మన విలువలను గొప్పతనాన్ని పెంచేవి*

సంస్కారం సభ్యత అనేవి పూర్వీకుల నుండి
మన పెద్దల నుండి వచ్చు అమూల్య సంపద
అనుకరణ ద్వారా అలవోకగా వచ్చు కానుకలు
తరతరాలుగా వస్తున్న అరుదైన జ్ఞాపికలు!

తల్లిదండ్రులు గురువులు సమాజం నుండే
పిల్లలు నేర్చుకుంటారు, అనుకరిస్తారు
అమ్మానాన్నలు చక్కగా నడుచుకుంటేనే
పిల్లలకు సంస్కారం సభ్యత అబ్బుతాయి
*యధా మాతృమూర్తులు తధా పిల్లలు*

తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు
నమస్కరించడం మన సంస్కారం
బస్సులలో రైళ్ళలో స్త్రీలను, వృద్ధులను
వికలాంగులను వారి వారి సీట్లలో
కూర్చో నివ్వడం గొప్ప సంస్కారం!

ఆడ పిల్లలు, స్త్రీలు చక్కగా దువ్వి జడలు
వేసుకోవడం, నిండుగా డ్రెస్ వేసుకోవడం
చేతులకు గాజులు వేసుకోవడం నుదుట
కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అందరితో
మర్యాదగా మాట్లాడటం చక్కని సభ్యత!

వివాహ స్త్రీలు నిండుగా చీర జాకెట్ తో పాటు
నుదుట కుంకుమ మెడలో పుస్తెల త్రాడు
కాళ్ళకు మెట్టెలు ధరించడం సభ్యత
విధవరాళ్ళు పుస్తెలు మెట్టెలు తీసేయడం సభ్యత!

వృద్ధ తల్లిదండ్రులను పోషించడం భాద్యత
వారు గతించి నపుడు కర్మకాండలు చేయడం
సంస్కారం
అప్పుడు ధరించాల్సిన వస్త్రాలు సభ్యతను
సూచిస్తాయి
ఎంతటి సంస్కారం సభ్యతతో ఉంటే
అంత విలువ గౌరవం పెరుగుతుంది
పితృ కర్మలను నిర్లక్ష్యం చేస్తే, ఆత్మ శాంతించక
రేపు వంశ వృద్ది జరుగదు ఇది సత్యం


ఎందుకు అలా మౌనం/సిగ్మాలు

అంశం: సిగ్మాలు

పదాలు:
*ఎందుకు* , *ఏమిటి*, *ఎలా*, *ఎప్పుడు*, *ఎక్కడ*, *ఎవరు* *ఇలా*  *చేత*, *వలె* ,*అలా*:

శీర్షిక: *ఎందుకు అలా మౌనం*

ఓ సుకుమార సుందరీ *ఎందుకు* అలా మౌనంగా ఉన్నావు?
ఓ అనురాగ కోమలి *ఎందుకు* అలా అలిగి కూర్చున్నావు?

*ఏమిటి* నీ ఆలోచనలకు కారణం?
*ఏమిటి* నీ బుంగమూతికి పరిష్కారం?

గతంలో  *ఎప్పుడు* నీవు ఇలా లేవే!
నేను *ఎప్పుడు* నిన్ను  ఇలా ఊహించు కోలేదు సుమా!

*ఎలా* ఇప్పుడు నేను ఏమి చేయాలి చెలీ!
*ఎలా* నిన్ను ఊరడించాలీ నా ప్రియ సఖీ!

*ఎక్కడ*  నా వలన పొరపాటు జరిగింది రాణి!
*ఎక్కడ* నీ మనసు బాధ పెట్టి ఉంటాను పూబోణి!

నిన్ను *ఎవరు* ఏమీ అనలేదు కదా మధుర వాణి!
నీపై *ఎవరు* కోపం చూపలేదు కదా అలివేణి!

*ఇలా* ఎంత సమయం ఆహారం లేకుండా ఉంటావు!
*ఇలా* ఉంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా!

నా *చేత* నైనా కొద్దిగా ఇడ్లీ తిను తినిపించుతాను!
నీ *చేత*  కొన్ని మంచి నీళ్ళైనా త్రాగు నీరసంగా ఉన్నావు!

మన బుజ్జాయి *వలె* ఒక్క సారి నవ్వు!
ఒక దేవత *వలె* నన్ను ఈ సారికి మన్నించు!

వావ్! ఇప్పుడు మనం *అలా* సినిమాకు వెళ్దామా సరదాగా!
ఆహా! వెళ్తుంటే జనం *అలా* చూస్తుంటారు మనలను ఓరగ!

Monday, April 7, 2025

నా కలల రాణి

*అంశం* *పదాల కవిత*

*కలల వారథి*
*చూపుల నావ*
*వలపు వెన్నెల*
*వరద గోదారి*

శీర్షిక: నా కలల రాణి

గల గల పారే నిండు *వరద గోదారి* లా
జల జల జారే జలపాతంలా
పచ్చని మైదానంలో పురి విప్పిన నెమలిలా
హొయలు ఒలికిస్తున్నావే నా వాణి!

నీవు విసిరే ఆ *వలపు వెన్నెల* కు
జాబిలి సిగ్గు పడుతున్నట్లుగా
మనసు పూదోటలో విహరిస్తున్నట్టుగా
మేను ఆకాశంలో తేలి పోతున్నట్లుగా ఉందే!

లేలేత కిరణాల వంటి *నీ చూపుల నావ* తో
నాకు లంగరు వేసి కదలకుండ చేస్తివా
చంద్ర బింబం వంటి నీ మోముతో
ముసి ముసి నవ్వులతో మెరిసి పోతుంటివే!

ఎంతో కాలంగా నేను కట్టుకున్న *కలల వారధి*
నేను కంటున్న కలల స్వప్నం
నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందా
ఆహా! ఇది కలా నిజమా నా కలల రాణి!



హృదయం అద్దం లాంటిది

అంశం: హృదయం రాయా? కమలమా?

శీర్శిక: హృదయం అద్దం లాంటిది

హృదయం అద్దం లాంటిది, పగులుతే అతకదు
రాయిలా కఠినమైనది కమలంలా సునిశితమైనది
పంచేంద్రీయాల సమాచారంతో మారుతుంది
మనుషుల గుణాలను బట్టి స్పందిస్తుంది!

మనుషులు మూడు రకాల గుణాల వారుంటారు
సత్వ రజో తమో గుణములు గలవారు
సాత్వికాహారం తీసుకునేవారు సత్వగుణస్థులు
వీరు ప్రేమ దయ జాలి కరుణ కలిగి ఉంటారు!

ఏదైనా తింటూ త్రాగుతూ దైవ చింతన లేనివారు
రజో గుణస్థులు అహం కోపం గర్వముండువారు
ఏ శాస్త్ర నియమం లేకుండా తింటూ త్రాగే వారు
తమో గుణస్థులు వీరు తిట్టడం కొట్టడం చంపడమే!

హృదయ స్పందన అనేది ప్రాంతాలను బట్టి
కాలాలను బట్టి పూర్వ జన్మ కర్మలననుసరించి
తల్లిదండ్రుల పెంపకం  గురువులను బోధన
సమాజ తీరును బట్టి మారుతుంది!

సాత్విక తత్వం గల వారైన గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద
వంటి వారల హృదయాలు కమలాల్లా నుండు
వీరి మనసు ఎప్పుడూ ప్రేమ జాలి దయతో మెండు
వీరే నిత్యనూతనంగా చరిత్రలో వెలుగుతారు!

నింగి నేల మన జీవన గీతం

అంశం: నింగి నేల మన జీవన గీతం


శీర్షిక: నింగి ఎత్తు ఎదిగినా...

*భార్యా భర్త లేకుండా కుటుంబం లేదు*
*నేల నింగి లేకుండా విశ్వం లేదు*
*తాళాలు కదుపకుండా శబ్ధం రాదు*
*గొంతు పెకలకుండా జీవిత గానం లేదు*!

నింగికి నేలకు ఉంది అవినాభావ సంబంధం
ప్రకృతిని పర్యావరణాన్ని పంచభూతాలను
పరిరక్షించు కుంటేనే జీవకోటికి మనుగడ
ప్రకృతికి తూట్లు పొడిస్తే మిగిలేవి దుఃఖ గీతాలే!

నింగి అంత ఎత్తులో ఆశయాలు లక్ష్యాలు
సహనం సర్దుబాటు తత్వం ఉన్నను
నేల కన్న దిగువలో అహం కామ క్రోధ లోభ
మోహ మద మాత్సర్యాలు ఉన్నను
మన జీవితం మధుర గీతమే కదా!

గగన వీదుల్లో మనిషి సత్వగుణాలు ఉండి
నేల మాళిగలలో రజో తమోగుణములున్న
ఆ మనిషి జీవితం నిత్యం కళకళ లాడే
అందాల హరివిల్లే మధుర గానం చేయును కదా!

నింగి నేల నడుమనే మనిషి మనుగడ
ఎన్ని విద్యలు నేర్చి ఎంత సంపాదించినా
నింగి ఎత్తు ఎదిగినా ఆకాశంలో విహరించినా
నేలకు చేరాల్సిందే మట్టిలో కలువాల్సిందే!

శ్రీ రామ చరితం/శిశిరాలు

అంశం: ప్రక్రియ: శిశిరాలు 

శీర్షిక: శ్రీ రామ చరితం

అయ్యో!
*కల్ల బొల్లి* మాటలు చెప్పి మందర
*గుస గుస* చెప్పే కైకేయికి దశరధుని కోరమని
*గబ గబ* రాముడిని అడవులకు పంపమని
భరతుడికి పట్టాభిషేకం చేయమని చెప్పే!

ఏమీ!
*చేయు నేమి* లేక దుఃఖితుడైన దశరధుడు
*జల జలా* కన్నీరు కార్చుతూ
*మనసు ధిటువు* చేసుకుని మూగ స్వరంతో
అడవులకేగమని చెప్పె రాముడికి!

హతవిధీ!
*మారు మాట* చెప్పకుండా రఘుకుల సోముడు
*చక చకా* బయలుదేరే సీత లక్ష్మణుడు వెంటరాగ
*అష్ట కష్ట* ములు పడిరి కానలందు
సీతనపహరించే మాయ రావణుడు పర్ణశాలలో!

ఓహో!
*అతి బల* శాలుడైన వాలిని హతమార్చి
*కలిసి మెలిసి* యున్న సుగ్రీవునికి రాజ్యమప్పగించె
*దుష్ట శక్తి* యైన రావణుడిని సంహరించి
పతివ్రత యైన సీతను తోడ్కొని అయోధ్యకేగే రాముడు

ఆహా!
కళ కళ లాడెను అయోధ్యానగరం 
తళతళ మెరిసెను పట్టణమంతా కాంతులతో 
జయజయ ధ్వానాలు చేసిరి పురజనులంతా
శ్రీ రాముడు అయోధ్యను పాలించే ధర్మరీతిన!

విఘ్నాలు తొలగించు గణపతి

 అంశం: *బొజ్జ గణేశ గొప్పతనం*

శీర్షిక: *విఘ్నాలు తొలగించు గణపతి*

పేరు: *మార్గం కృష్ణ మూర్తి*
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9441841314
హామి: ఇది నా స్వీయ రచన , దేనికి అనుకరణ ,అనువాదం కాదు

పూజ ఆరంభించాలన్నా
మీటింగ్ ప్రారంభించాలన్నా
పెళ్ళి పనులు  మొదలు పెట్టాలన్నా
వివాహములు  జరిపించాలన్నా
ఎలాంటి విఘ్నాలు జరుగ కూడదన్నా!

మొరపెట్టుకునేది గణనాధుడికే
తలిచేది ముందుగా విఘ్నేశ్వరుడినే
పూజించేది ముందుగా గణేశుడినే
"శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం"
అంటూభక్తులు మనఃస్పూర్తిగా స్మరిస్తారు!

నమ్మిన బంటు ఎవరంటే గుర్తుకు వచ్చేది
తండ్రినే ఎదిరించిన వినాయకుడే
తెలివిగా ఆపదల నుండి గట్టెక్కే వారెవరంటే
కుమారస్వామిని గెలిచిన గణేశుడే

కుల మతాల భేదం లేకుండా
పేద ధనిక భేదం లేకుండా
ప్రాంతాల తారతమ్యం లేకుండా
విగ్రహాలు పెట్టుకుని నవరాత్రులు

అంగ రంగ వైభవంగా ప్రతియేటా
బాధ్రపద మాస శుక్లపక్ష చవితి నుండి
తొమ్మిది దినములు పూజలు జరిగేది
పండుగల్లా ఉత్సవాలు జరుపుకునేది
చివరి రోజు గణపతి పూజల లడ్డూలను
వేలు లక్షలకు కోలా హలంగా వేలం వేసేది
విగ్రహాలను నదులలో ,కొలనులలో
నిమజ్జనం చేసేది బొజ్జగణపతినే!

గణేషుడంటే ప్రజలకు ఒక దైవం
గణపతి అంటే ప్రజలకు ఒక నమ్మకం
వినాయకుడంటే భక్తులకు ప్రాణం
విఘ్నేశ్వరుడంటే జనులకు సర్వస్వం
ఇంతకంటే గొప్పేమి కావాలి గణనాథుడికి

Sunday, April 6, 2025

అబ్బబ్బ పాలన

అంశం: సమాజ సేవ


శీర్షిక: *అబ్బబ్బ పాలన*

సీ .ప:
అబ్బబ్బ పాలన నబ్బురముగ నుండే
భగభగ ధరలన్ని భగ్గుమనెను
గబగబ నాయకుల్ గుబులును రాజేసి
బుస్సుబుస్సుమనుచు బుసలు కొట్టె
దడదడ గూండాలు బడితపూజలు జేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బులాగె!


ఆ.వె:
విస్కి విస్కీ యంటు వింతలు జేయుచు
గుట్టు చప్పుడుగను గూడు కూల్చి
వొట్టు పెట్టి తట్టి వోట్లను లాగిరి
సేవ యిదియెననిరి సేదతీరి !

  

నాన్నంటే ధైర్యం

అంశం: పితృదేవోభవ!

**********************

శీర్షిక: *నాన్నంటే ధైర్యం* 

**********************

నాన్నంటే ప్రేమ! నాన్నంటే రక్షణ! నాన్నంటే ధైర్యం!

నాన్నంటే భయం! నాన్నంటే త్యాగం!నాన్నంటే ఆదర్శం!

నాన్నంటే బాధ్యత! నాన్నకు నాన్నేసాటి! నాన్నకు ఎవరులేరు మేటి!

నడక  నడత నేర్పేది నాన్నే! భవిత బాసట నిచ్చేది నాన్నే!

గమ్యానికి చేర్చేది నాన్నే !జీవిత పాఠాన్ని నేర్పేది నాన్నే!

క్రొవ్వొత్తిలా కరిగిపోయేది నాన్నే! కొనఊపిరివరకూ భాద్యత వహించేదీ నాన్నే!

అమ్మ శిషువును కడుపున మోస్తే, నాన్న తన గుండెలో మోస్తాడు!

జన్మ నిచ్చేది అమ్మైతే, జీవితాన్ని పంచేది నాన్ననే!

వేలుపట్టి నడిపించేది నాన్నానే ప్రపంచానికి వెలుగెత్తి చాటేది నాన్ననే!

అమ్మ కమ్మని పాలుపడితే నాన్న తన జీవితాన్నే త్యాగంచేయు!

అమ్మ ఇంటిని చూపిస్తే నాన్న ప్రపంచాన్నే చూపించు!

కరుణ యున్న కారణ్యమున్నా బాధ కలిగినా, సంతోషం కలిగినా!

కష్టం వచ్చినా  దుఃఖం వచ్చినా తనగుండెల మాటునే దాచిపెట్టు!

నాన్న కోపానికి అర్ధం బాధ్యత నాన్న బాధకు అర్ధం బాధ్యత!

కుటుంబ బాధ్యత మోయుచుండు కానీ దానినెవరికీ కనిపించ నివ్వకుండు!

నాన్న ఆలోచనలు అనిర్వచనీయం నాన్న వ్యక్తిత్వం ఆదర్శనీయం!

నాన్న ముఖం నవరసాల ప్రతిబింబం నాన్న దూరదృష్టి మహోన్నతమైనది!

అది ఎంతో మందికి స్పూర్తిదాయకం, నాన్న మనసు చల్లని హిమపర్వతం!

తూలుతూ రగులుతూ  కరుగుతూ రాల్లు రప్పలు ఎన్ని ఎదురైనా!

నిరంతరం సాగే జీవనది నాన్న! నాన్నంటే ధైర్యం నాన్నంటే ప్రాణం!

Saturday, April 5, 2025

శ్రీ రామా కోదండ రామా..!

అంశం: భక్తి గేయాలు 

శీర్షిక: శ్రీ రామా.... కోదండ రామా...!


పల్లవి:

అతడు:

రామా... శ్రీ రామా 

రామా... రఘుకల సోమా..

శ్రీ రామా... కోదండ రామా...

రామా.... అయోధ్య రామా...

రామా... శ్రీ సీతారామా...

ఏమయ్యా నీ లీలలు.. ...

జగములు పిక్కటిల్లునటుల....

ఏ ఇంటి లోనూ ఏ గుడిలోనూ 

నీ రామ నామ జపములే...  "రామా"


చరణం:01

అతడు:

ఆపదమొక్కుల వాడివట....

అందాల రాముడి వట.....

దశరధుని కుమరుడివట..

సీతమ్మ తల్లి నాధుడివట..

ఓకే మాట ఒకే బాణం ఒకే పత్నియట...

పితృవాక్య పాలకుడివట...

ధర్మ పాలకుడవు నీవే నట...

ఆంజనేయుడికి ఆదర్శమూర్తివట   "రామా"


చరణం:02

అతడు:

ఎవరింటా నీవే నటా 

నిత్యం నిన్నే కొలిచెదరటా..

రామ నామము జపించిన చాలట.. 

సకలు పాపములు బాయునట...

పిలిచిన పలికెదవట రామా..

కోరిన కోర్కెలు తీర్చెదవట...

రామా... శ్రీ రామా... పరంధామా...       "రామా"


చరణం:03

అతడు:

రామా..నీవే నయా...

శ్రీ రామా నీవే నయా మా పాలిట దైవం..

నిత్యం నిన్నే కొలుతుమయ్యా ...

అనునిత్యం నిన్నే సేవింతుమయ్యా....

మా ఇలవేల్పువు నీవే నయ్యా....

మిమువీడము మేమెప్పటికయ్యా....

మము దీవించు నెప్పటికయ్యా.....    "రామా"

మతం మనిషి స్వార్థపు ఆయుధం

*అంశం*- *మతము కన్న మమత గొప్పది*

శీర్షిక:*మతం మనిషి స్వార్థపు ఆయుధం*


మతమన్నది గతం 

మమతన్నది మన సమ్మతం 

మమత జనబాహుళ్యానికి హితం 

మమతలు ప్రేమలు కొనసాగాలి సతతం!


మతమన్నది మనిషి స్వార్థం 

మమత మనిషి హృదయంలో పులకించింది

మతం మనిషి ఏర్పరుచుకున్న బంధీఖాన 

మమత పురి విప్పిన నెమలి విహంగం!


కులమతాల కుమ్ములాటలతో 

ఓటు బ్యాంకు పధకాలతో 

మమతలు మాయమవుతున్నాయి 

ప్రేమానురాగాలు దూరమవుతున్నాయి!


మతం మతం అంటూ మానవత్వం మరిచి 

మనిషి లోని జ్ఞాన తత్వం విడిచి 

యావత్ ప్రపంచ ప్రజలను రెచ్చగొట్టి

పబ్బం గడుపుతున్న కుటిల నాయకులను 

మమత దయ కరుణలతో మార్చుదాం

దేశ ప్రగతికి స్వాగతం పలుకుదాం!!

గుండె శక్తికి ఒక హద్దు ఉంటుంది

అంశం: చిత్ర కవిత (మెదడు గుండె)


శీర్శిక: *గుండె శక్తికి ఒక హద్దు ఉంటుంది*

బండిని లాగే ఎద్దుల శక్తికీ ఒక హద్దు ఉంటుంది
వాటి శక్తి మించి బండిలో వేస్తే ఆగి పోతాయి
రోజూ ఎక్కిదిగే లిఫ్ట్ శక్తికి ఒక హద్దు ఉంటుంది
దాని శక్తికి మించి ఎక్కువైతే ఆగిపోతుంది!

మెదడు మంచు తెరలా చాలా సున్నితమైనది
జీవ నాడులన్నీ మెదడుతో కలిసి ఉంటాయి
శిరస్సు కేంద్ర నాడీ మండల వ్యవస్థ
పంచేంద్రియాలు ప్రతిదీ కేంద్రానికి చేర వేస్తాయి!

మెదడు ఎంత తేలికగా ఉంటే అంత ఆరోగ్యం
మనిషి అరిషడ్వర్గాలైన కామక్రోధమోహలోభ
మదమాత్సర్యాల వలన మెదడు బరువెక్కుతుంది
ఆ బరువు గుండె పైన భారం వేస్తుంది!

గుండె శక్తికి ఒక హద్దు ఉంటుంది
అది మించితే గుండె జబ్బులకు దారితీస్తుంది
చెడు ఆలోచనలు గుండే బరువు పెంచుయి
గుండె పైన బరువు క్షేమదాయకం కాదు
దానిపై బరువు తగ్గించు కోవడం ఆరోగ్యకరం
గుండె తేలిక ఆనందాలకు నిలయం
గుండె ఉల్లాసం వలన ఆయుష్షు పెరుగుతుంది!

ఎందుకో అలక!

*నేటి అంశం* *అలక*ఎందుకో*


శీర్షిక: *ఎందుకో అలక!*

ఓ నా కలల రాణి
అందాల సుందర పూబోణి
మధుర మనోహర వీణావాణి
హొయల సోయగాలతో నా యెదమీటే రాణి!

ఎందుకో అలక
ఓ నా బంగారు చిలుక
అనురాగాల ఆనందాల మొలక
కాస్తనైన విడదీసి చెప్పవే ఆ మలక!

వెన్నెల జాబిలి లాంటి నీ మోము
కలువ రేకుల వంటి నీ కనులు
హంస రెక్కల వంటి  నీ కనురెప్పలు
తామర తూడుల వంటి సన్నని నీ నడుము!

ఓ నా మంజరీ ఎందుకో ఆ అలక
నాకు తలలో పిలక జుట్టు ఉందనా
ఇంట్లో ఎలుక ను పారదోల లేదనా
నిన్ను చెలుక కు తీసుకపోలేదనా
మలక విప్పవే మెలిక తీయవే ఓ వయ్యారీ!

 

Friday, April 4, 2025

పర్యావరణో రక్షతి రక్షితః

అంశం: పర్యావరణ చైతన్యం

శీర్షిక:*పర్యావరణో రక్షతి రక్షితః*


*దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులలో య్* అని గురుజాడ అన్నట్లు 

*పర్యావరణమంటే మనుషులు కాదోయ్* *పర్యావరణమంటే తరులు గిరులు ఝరులోయ్*

*పర్యావరణాన్ని మనం రక్షిస్తే*

*మనలను ప్రభుత్వం రక్షిస్తుంది*


నదులు చెరువులు ప్రకృతి పంచభూతాలు 

జలపాతాలు సమస్త జీవకోటి సంరక్షకులు 

పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవాళి పురోగతి 

కాదు కూడదని పట్టించుకోకుంటే అధోగతి 

ప్రతి ఒక్కరికీ కాపాడాలని ఉండాలి మతి 

లేదంటే విషమించుతుంది జీవకోటి పరిస్థితి 


పరిశ్రమలు పెట్రోల్. డిజిల్ యుద్ధాలతో 

పెరిగి పోతుంది వాయు కాలుష్యం

ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ తో తయారయే 

బాటిల్స్ వంటి మరెన్నో వస్తువులతో

నదులు సముద్రాలు ఝరుల కాలుష్యం 

వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో 

జల  ధరణి వాతావరణం కాలుష్యం 

పర్యావరణ కాలుష్యం పెరుగుతుండే నిత్యం 

చాప కింద నీరులా విస్తరించే దేశమంతా!


పర్యావరణం ప్రభుత్వ సంపద కాదు 

సర్కారు పాలన రైలు ప్రయాణం లాంటిది 

పాలకులు రైలు డబ్బాలో ప్రయాణిస్తారు

ఐదేళ్ల గమ్యం చేరాక దిగి పోతారు 


పర్యావరణం ప్రకృతి దేశ సంపద 

ప్రభుత్వ సహాకారంతో ప్రజలే  ప్రకృతిని 

పర్యావరణాన్ని  కాలుష్యం నుండి కాపాడాలి 

ప్రతి ఒక్కరూ ఆందుకు భాద్యత తీసుకోవాలి 


ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం 

జరుపడమే కాకుండా కార్యాచరణ ఉండాలి 

కలుషిత వస్తువులైన ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి 

పనికి రాని ఎలక్ట్రానిక్ వస్తువులను 

రిసైక్లింగ్ చేయాలి 

మురుగు నీటిని శుద్ధి చేయాలి 

కాలుష్య నివారణ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి 

హరిత హారం అభివృద్ధిలో చిత్త శుద్ధి ఉండాలి 

*పర్యావరణో రక్షతి రక్షితః*

పొగడ తరమా నీ కీర్తి రామా!

*నేటి అంశం*చిత్ర కవిత*


శీర్షిక: *పొగడ తరమా నీ కీర్తి రామా!*


రామా పరంధామా అయోధ్య రామా

ఏమి నీ చరితము ఏమీ నీ లీలలు 

దివి నుండి భువికి దిగివచ్చిన రామా 

ఏమీ నీ సుందర మనోహర అవతారాలు!


త్రేతాయుగంలో దశరథుడి కౌసల్యల

పుత్రుడిగా జన్మించావు  మానవుడిగా

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు 

అస్త్రశస్త్ర విలు విద్యలను నేర్చావు!


ఒకే బాట ఒకే బాణం అంటూ ఋజువు చేస్తూ 

నీతి నిజాయితీ ధర్మ పాలనతో 

జాలి దయ కరుణ అను సుగుణాలతో 

దేవుడవయ్యావు జగతిలో శ్రీ రామా !


శివ ధనుస్సు విరిచి జనకుడి కూతురైన 

సీతను వివాహమాడి అయోధ్య కేగగ 

మాయావి మందర కైకేయి నెగవేయ 

కోరే నీ తండ్రిని , నినునడవికి పంపమని 

సోదరుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని!


పితృ మాట జవదాటని పరంధామా

అడవి కేగితివి పదునాలుగు వత్సరములు 

సీతమ్మ తమ్ముడు లక్ష్మణుడు వెంటరాగా 

అష్టకష్టాలు పడుతూ రాక్షసుల సంవరించి 

ఋషులను రక్షించి, అహల్యకు శాపం 

విముక్తి గావించి, శబరికి ఆత్మీయుడవైతివి!


వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యమప్పగించి 

రావణుడపహరించిన జానకి జాడను 

పరమ భక్తుడు హనుమ  దెలుపగనే

లంకకేగి రావణుడితో తలపడి  సంవరించి 

విభూషణుడికి లంక నప్పగించితివి రామా!


సీతా సమేతంగా అయోధ్యకేగి 

ధర్మ పాలన చేసితివి కోదండరామా

ఏమీ నీ లీలలు రఘుకుల సోమా 

రామ రామ అని పలికిన చాలు 

కోరిన కోరికలు తీర్చే శ్రీ సీతారామా 

పొగడతరమా నీ గొప్పలు అవనిన భక్తులకు!


Thursday, April 3, 2025

పదపద ముందుకు

అంశం: అభ్యుదయం


శీర్శిక: *పదపద ముందుకు*

పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు సంకెళ్లు బుద్దలుకొట్టి
ఎంత కాలం ఈ అమాయకత్వం
ఇంకెంత కాలమోయ్ ఈ బానిసత్వం!

హామీలు అటకెక్కే
మాటలు కోటలు దాటే
ఆశలు ఆకాశహార్మ్యాలు
ఊహలతో ఇంద్రధనుస్సులు
ఉచితాలతో ఊడిగం పధకాలతో ప్రాబల్యం
నిరంకుశ పాలనతో ఆదిపత్యం
పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు సంకెళ్లు బద్దలుకొట్టి
ఎంత కాలం ఈ అమాయకత్వం
ఇంకెంత కాలమోయ్ ఈ బానిసత్వం

అవే ఓటు బ్యాంకు పధకాలు
అవే కుల మతాల కుమ్ములాటలు
అవే అవినీతి భూకబ్జా దందాలు
అవే క్విడ్ ప్రో పధకాలు  అవినీతి బాండ్లు
తిలా పాపం తలా పిడికెడు

కలం పట్టు కాగితంపై పెట్టు
గళం విప్పు ఘన స్వరం పెంచు
పదపద ముందుకు నడుం బిగించి
పదపద ముందుకు బానిస సంకెళ్లు బద్దలుకొట్టి!

అనుమానం పెనుభూతమా?

అంశం: సంశయ స్వరం 

శీర్షిక: *అనుమానం పెనుభూతమా?


*సంశయాత్మా వినశ్యతి* అనేది లోకోక్తి 

సంశయంతో ఒక నిర్ణయానికి రాలేక

సందిగ్ధంలో కొట్టుమిట్టాడటం

అనిశ్చితి స్థితిలో ఉండి పోవడం!


మంచో చెడో అనుకూలమో ప్రతికూలమో 

ఒక నిర్ణయానికి రాలేకపోవడం

"దేవుడున్నాడు"  "దేవుడు లేడు" 

"దేవుడు ఉన్నాడో లేడో తెలియదు" 

"దేవుడు ఉన్నాడనీ చెప్పలేను 

అలాగని దేవుడు లేడనీ చెప్పలేను" 

అనేది "సంశయస్థితి"


సంశయం వేరు అనుమానం వేరు 

సంశయం అనిశ్ఛితి ని సూచిస్తే 

అనుమానం అజ్ఞానాన్ని తొలగించడాన్ని 

సూచిస్తుంది 

ఈ రెండూ నమ్మకానికి బద్ధ శత్రువులే


అనుమానాన్ని అసహ్యించదు 

అవమానించదు మన సనాతన ధర్మం 

అనుమానం లేకుంటే అజ్ఞానం తొలగదు 

జ్ఞానం లభించదు 


సంశయ స్వరం వలన కష్టాలు నష్టాలు 

బాధలు దుఃఖాలే తప్పా 

సుఖాలు సంతోషాలు ఆనందాలు 

లాభాలు ప్రయోజనాలు ఉండవు


కానీ మన పెద్దలు, 

*అనుమానం పెనుభూతం* అంటారు 

కొన్ని విషయాలలో అనుమానం 

పెనుభూతమే కావచ్చు, కానీ 

ప్రతి విషయంలోనూ భార్య భర్తను 

భర్త భార్యను, యజమాని ఉద్యోగిని 

ఉద్యోగి యజమానిని , పక్కింటి వారిని 

ఎదురింటి వారిని అనుమానించడం 

మొదలు పెడుతే అది కాస్తా

పెనుభూతంగా మారుతుంది 


ప్రతి సారీ సంశయ స్వరమే వినిపిస్తే 

ఎదుటి వారిలో నమ్మకం కోల్పోతారు 

అవమానాల పాలవుతారు 

ఆ తరువాత మాటకు విలువ ఉండదు 


అలానే అన్ని వేళలా పూర్తిగా నమ్మడం 

కూడా సరియైనది కాదు 

*ఆలస్యం అమృతం విషం*

అనుమానించడం ఆలస్యం అవుతే 

సర్వం కోల్పోవల్సి వస్తుంది 

వెతకడానికి ఇంకా ఏమీ మిగలదు 

అనుమానిస్తేనే అజ్ఞానం తొలుగుతుంది 

సంశయిస్తేనే నిజాలు వాస్తవాలు సత్యాలు 

వెలుగు లోకి వస్తాయి 

పోలీసులకు పరిశోధకులకు అనుమానం 

లేకుంటే సత్యాలను చేధించలేరు 


అనుమానమైనా నమ్మకమైనా 

బ్యాలెన్స్ గా ఉండటం ఉత్తమం 


Wednesday, April 2, 2025

ప్రజా సమైక్యం

అంశం:ప్రజా సమైక్యం 

శీర్శిక: *కలిసి ఉంటే కలదు సుఖం*


*కలిసి ఉంటే కలదు సుఖం*

*ఐకమత్యం మహా బలం* అనేది పెద్దల మాట 

*పెద్దల మాట పెరుగన్నం చద్ది* కదా


మనిషి సంఘ జీవి 

సమాజంలో ఒకరితో మరొకరికి 

అవసరాలు ఉంటాయి ఎప్పుడూ 

ఒకరి అవసరం మరొకరికి అత్యవసరం 

ఒకరి అత్యవసరం మరొకరికి అవసరం!


కులాలు వేరైనా మతాలు వేరైనా 

భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా 

పేద ధనిక తేడాలైనా 

సమైక్య జీవనం సంతోష దాయకం 

రేపటి తరాలకు ఆదర్శనీయం!


ప్రజలు సమైక్యంగా సహకారంతో ఉంటేనే 

ఏదైనా సాధించగలరు ఉన్నత స్థాయికి చేరగలరు 

సమాజంలో సహ జనుల తోడు ఉంటేనే

పోటీ తత్వం పట్టుదల ఏర్పడు!


ప్రజలను ఐక్యం చేసి గాంధీజీ సత్యాగ్రహాలతో

రుధిరం చుక్కను కార్చకుండా 

దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టే

ప్రజలను ఐక్యం చేసి నరేంద్ర మోడీ 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టే 

అయోధ్యలో రామ మందిరం నిర్మించే!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ

అంశం: *యాక్సెప్ట్ మై ఛాలెంజ్*

శీర్షిక: కుక్క కాటుకు చెప్పు దెబ్బ 

*కుక్క కాటుకు చెప్పు దెబ్బ* 

సోము అమాయకుడు 

పసిగట్టింది ఓ కిలాడి 

నెలనెలా అధిక వడ్డీ అని ఎర చూపింది 

రెండు లక్షలు తీసుకుంది 

మరుసటి నెల నుండే ముఖం చాటేసింది 

చరవాణీలు లేవు మాటలు లేవు 

విషయం అక్కకు చెప్పాడు సోము 

అక్క ఫోన్ చేసింది కిలాడీకి ఐదు లక్షలు ఉన్నాయి తీసుకుని పొమ్మని 

గబాలున వాలింది కిలాడి అక్క ఇంట్లో 

ఐదు లక్షలు బ్యాంకులో ఉన్నాయి 

కానీ నేను రెండు లక్షలు బ్యాంకు లోన్ తీరిస్తే ఐదు లక్షలు ఇస్తారంది 

ఆ రెండు లక్షలు అప్పుడే ట్రాన్స్ఫర్ చేసింది వయ్యారి 

అప్పుడు చెప్పింది సోము బాకి గురించి 

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయిందని 

కిలాడి గుట్టుగా వెళ్లి పోయింది.

*దష్టుని నీడలో తల*

పాముకు పాలు పోసి పెంచినా కరువక మానదు 

దుష్టుని ఇంటిలో నిద్ర పోరాదు 

కాటు వేయవచ్చు లేదా నిందలు వేయవచ్చు 

అందుకే *దుష్టునికి దూరంగా ఉండాలి* అంటారు పెద్దలు 

అతడి అవలక్షణాలను బట్టి దుష్టుడి గా గుర్తించాలి.

*అలుపెరుగని ఆశయాలు*

జీవితంలో ఆశయాలు  లక్ష్యాలు ఉండాలి 

కానీ అవి శక్తికి మించి ఉండకూడదు 

సాధించతగిన వాటినే ఆశయాలు పెట్టుకుని ముందుకు సాగాలి 

*అంతు చిక్కని ఆచరణలు*

ఆశయాలు లక్ష్యాలకు తగ్గా 

ఆచరణలు ఉండాలి 

అప్పుడే అనుకున్నది సాధించడం సాధ్యం 

సమయపాలన, ఓర్పు, సంకల్పం, నిరంతర సాధనతో 

ఏదైనా సాధించవచ్చు 


ఛాలెంజ్ 

శ్రీ రాముడి తత్వాలు 15

వృద్ధాప్యంలో పిల్లల కాఠిన్యం

*నేటి అంశం* *వృద్దాప్యంలో పిల్లలు కాఠిన్యం 


శీర్షిక: *నోరు మంచిదైతే ఊరు మంచిదే*

సృష్టి కర్త బ్రహ్మ ఉన్నాడో లేదో తెలియదు, కానీ
*తల్లిదండ్రులు సృష్టి కర్తలు ప్రత్యక్ష దైవాలు*
*ఇది జగమెరిగిన సత్యం ఇది జగద్విదితం*

అమ్మ లేనిది కలల నాన్న లేడు 
నాన్న లేనిది ఆత్మీయ అమ్మా లేదు 
అమ్మా నాన్న లేనిది జగతిలో సృష్టియే లేదు 
నవమాసాలు మోసి జనని
అప్పుల కుప్పలు చేసి జనకుడు 
సంతోషాలకు ప్రతీకగా శిశువుకు జన్మ నిస్తారు 
పెంచుతారు పెద్ద చేస్తారు
విద్యాబుద్ధులు నేర్పిస్తారు
వెన్నెలలో చంద్రుడిలా ఎల్లవేళలా 
ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుతారు
ఏ బాధలైన కష్టాలైనా గుండెలోనే
దాచుకుంటారు ధైర్యంగా తోడుంటారు!

అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే
నాన్న నవ వత్సరాలు బుజాన మోస్తాడు
గొడుగుకు నాన్న పై వస్త్రం అయితే
అమ్మ గొడుగు నిలువెత్తు స్టాండ్ లాంటిది
పిల్లలు చుట్టూ ఉన్న పుల్లల వంటి వారు!

ఎన్నో కుటుంబాల తల్లిదండ్రుల పిల్లల
జీవితాలను పరిశీలిస్తే పరిశోధిస్తే విశ్లేషిస్తే
తల్లి తండ్రులు జన్మనిచ్చింది పెంచింది
పెద్ద చేసింది తమ కొడుకులను బిడ్డలనే కానీ 
కోడళ్ళను అల్లుండ్లను ఎంతమాత్రం కాదు!

పెళ్ళిళ్ళు అయ్యాక కొడుకులు బిడ్డలు
కోడళ్ళు అల్లుండ్ల చేతిలో బంధీలు
పసుపు కుంకుమల క్రింద డబ్బు నగలు
కోడళ్ళు తెచ్చినా పేదలు తేలేక పోయినా
అల్లుండ్లు సంపాదించినా సంపాదించకున్నా
ఉద్యోగాలు చేసినా చేయకపోయినా 
వారు మెట్టినింటి వారే 

అత్తా మామల చేత చెంబెడు నీళ్ళు 
త్రాగింది లేదు పిడికెడు అన్నం తిన్నది లేదు 
ఒళ్ళు రాయించుకున్నదీ లేదు 
ఏ సేవలు పొందనివారే ఏప్రేమలు పొందనివారే
అలాంటి వారిపై అత్తా మామల పెత్తనం
ఎంత వరకు సబబు?

*నోరు మంచిదైతే ఊరు మంచిదే* అన్నట్లు
కాలం మారుతుంది టెక్నాలజీ పెరుగుతుంది
లోకం పోకడలను అర్ధం చేసుకోవాలి వృద్ధులు
మాతృమూర్తులు కాలానుగుణంగా మారాలి
పెళ్ళి రోజు నుండే  *నేను అత్తను*
*నేను మామను* అనే అహాన్ని ప్రక్కన పెట్టాలి
*కోడలును బిడ్డగా , అల్లుడిని కొడుకుగా*
ప్రేమానురాగాలను జాలి దయను పంచిన
వెలుగొందు ఆ కుటుంబాలు ఆచంద్రతారార్కం!

*మొక్కై వంగనిది మానై వంగునా* అన్నట్లు
మొక్కగా ఉన్నపుడు ప్రేమించక దయచూపక
మానైనాక ప్రేమిస్తే అది నటన అవుతుంది
అప్పుడు జీవితాలు నగుబాటు పాలవుతాయి!

కన్న తల్లిదండ్రులు పెంచిన తీరును బట్టి
ఏ కొడుకూ ఏ బిడ్డా తల్లిదండ్రులను కాదనరు
తమతమ భాగ స్వాములకు తగిన గౌరవం
అమ్మా నాన్నలు ఇవ్వాలని కోరుకుంటారు!

వృద్ధ తల్లిదండ్రులు అత్తా మామలు
వయసు పెరిగే కొద్దీ ఊరికి దూరమవుతారు
కాటికి దగ్గరవుతారన్న సత్యం మరువరాదు
ఆస్తులుకాదు దగ్గరకు చేర్చేవి, అనురాగాలు
ఏది పంచుతే అదే లభిస్తుంది!

*నేను*, *నా* అనే భావనలు వదిలి
*మేము* *మనం* అనే భావనలు పెంచుకోవాలి*
అప్పుడే అన్ని కుటుంభాలలో నవ్వుల
పువ్వులు పూస్తాయి పరిమళాలు వెదజల్లుతాయి
నవనవోన్మేషంగా సాగి పోతాయి జీవితాలు!

(తల్లి దండ్రులు అర్ధం చేసుకుని ఒక్కరు మారినా నా జీవితం ధన్యం)

Tuesday, April 1, 2025

ఒకే మాట ఒకే బాణం రాముడి తత్వం

శీర్షిక: ఒకేమాట ఒకే బాణం రాముడి తత్వం


అయోధ్య రాముడు రఘుకుల సోముడు
దశరధుడి పుత్రుడు పితృవాక్య పాలకుడు
సీతా లక్ష్మణులు వెంట రాగా పదునాలుగు
వత్సరములు వనముల కేగే శ్రీ రామచంద్రుడు!

కోదండ రాముడి తత్వం వేదామృతం
ఒకే మాట ఒకే బాట ఒకే భాణం
ఆలోచన ఉన్నతం ఆశయం మహోన్నతం
రఘుకుల సోముడు శ్రీ రామచంద్రుడు!

రాక్షసులనుశిక్షించి ఋషులను రక్షించాడు
రాతిని తాకి అహల్యకు మోక్షం కలిగించాడు
శబరి ఎంగిలి తిని ఆత్మీయు డయ్యాడు
ఏక పత్నీ వ్రతుడు శ్రీ రామచంద్రుడు!

ఇచ్చిన మాటకు కట్టుబడి వాలిని హతమార్చి
సుగ్రీవుని కిష్కింధకు రాజును చేేసే
ధర్మబద్ధంగా లవకుశులతో యుద్ధం చేసి
ధవళ అశ్వాన్ని తోడుకుని అయోధ్య కేగే!

హనుమను భక్తుడిగా స్వీకరించే
భక్తుడి సాయంబున జానకి జాడ తెలిసే
రావణుడిని హతమార్చి లంకలో విభీషణుడికి
పట్టాభిషేకం చేసే శ్రీ రామచంద్రుడు!

శ్రీ సీతారాముడు లక్ష్మణుడి సమేతముగా
అయోధ్య కేగే పట్టాభిషేకం జరుగగ
ధర్మపాలనతో ప్రజలెంతో సంతోషించే
రామ రామ అని జపము చేసిన చాలు
వరములు కురుపించు అయోధ్య రాముడు!

హామీ: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు 

బంధాలకు బంధీ

అంశం: బంధాలకు బంధీ


శీర్షిక: *హద్దులతో కూడిన బంధం సుఖమయం*

*మనిషి ఎడారి జీవి కాదు
*మనిషి సంఘ జీవి*
*పది మందితో కలిసి జీవించాల్సి ఉంటుంది*

అంతే కాదు,

*రావి చెట్టు ఉసిరి చెట్టు కలిసి*
*బంధంగా పెరిగితే ఎంత పవిత్రత ఏర్పడుతుందో*
*కుటుంబ సభ్యులంతా బంధంగా కలిసి జీవిస్తే*
*అంత విలువ పవిత్రత ఉంటుంది*

*తరువుకు భూమి ఎంత ముఖ్యమో*
*చెరువుకు నేల ఎంత ముఖ్యమో*
*మేఘాలకు తరువులు చెరువులు ఎంత ముఖ్యమో*
*మనిషికి మరో మనిషి తోడు అంతే ముఖ్యం*

*శిశువు బొడ్డు పేగుతో కలిసే జన్మిస్తుంది*
తప్పని పరిస్థితిలో డాక్టర్ బొడ్డుతాడు కత్తిరిస్తాడు
కానీ జీన్స్ రధిరం తోనే శిశువు లోకి ప్రవేశిస్తాయి
అలా రక్త సంబంధాలు ఏర్పడుతాయి
ఆలుమగలతో బంధువులతో బంధాలుఏర్పడు!

ఋతువులకు తరువులకు 
పంచ భూతాలకు పంచేంధ్రీయాలకు
రుధిర సంబంధాలు ఉండక పోవచ్చు
కానీ మానవులకు రక్త సంబంధాలు ఉంటాయి
భార్యా భర్తలకు కన్న బిడ్డలతో సంబంధాలు
ప్రేమ బంధాలు ఉంటాయి!

అయితే బంధాలకు కొన్ని హద్దులు ఉండాలి
బంధాలకు ప్రేమలు గౌరవాలు ముడిపడి ఉంటాయి
బంధాలు వ్యక్తి స్వేచ్ఛను *బంధీ చేస్తాయి*
మనిషి ఎదుగుదలను నిలిపి వేస్తాయి
దేశాన్ని విడిచి ఉద్యోగాలు చేయలేరు
*బంధాలలో బంధీ అవుతే* వారు గతించినచో
తట్టుకుని బ్రతకడం చాలా కష్టం అవుతుంది !

బంధాలు అనుబంధాలు 
రక్త సంబంధాలు ఉండాలి 
కానీ అవి ఉభయులకూ అనుకూలమైన
హద్దులలో ఉంటే జీవితాలు సుఖమయం!

ఆటో ఆక్సిడెంట్ /మరో చరిత్ర

అంశం:మరో చరిత్ర 

శీర్షిక: ఆటో ఆక్సిడెంట్ 

అంకితం: ఆటో ఆక్సిడెంట్ అమరులకు అంకితం 

అప్పుడు సమయం ఉదయం పది గంటలు 

ఎవరి ఇండ్లల్లో వారు ఎవరి పనుల్లో వారు 

నిమగ్నమై పనులు చేసుకుంటున్నారు 

ఇంటి ముందు ఏదో డభాల్ మన్న శబ్ధం

చూస్తే ఆటో ఆక్సిడెంట్ ఆటో వెళ్లి పోయింది!


మూడు రోజుల ముందు మేము మా అక్కయ్య 

ఇంటికి వెళ్ళి భద్రాచలం రాముల వారి దర్శనం 

పాపికొండలు పడవ ప్రయాణం చేసి తిరిగి 

పాల్వంచకు ఆ రాత్రే చేరుకున్నాం!


మరుసటి రోజు ఉదయమే మెయిన్ రోడ్డు మీద 

ఆటో ఆక్సిడెంట్ వలన ఘోర సంఘటన 

ఇంటి ముందుకు వచ్చి చూసే సరికి 

చుట్టూరా ప్రజలు మధ్యలో ముగ్గురు 

ఆక్సిడెంట్ బాధితుల హాహాకారాలు!


హృదయ విదారకంగా ఉంది పరిస్థితి 

రుధిరం కారుతుంది పోలీసుల ఆచూకి లేదు 

ఇంట్లో కెళ్ళి  మంచినీళ్ళ బాటిల్ తెచ్చాను 

వద్దు వద్దు పోలీస్ కేసు అవుతుంది అన్నారు!


నిజమే అప్పుడు కోర్టులు కర్కశంగా ఉండేవి 

ఆక్సిడెంట్ బాధితుడిని ముట్టుకున్నా కేసే

హాస్పిటల్ తీసుకెళ్ళినా కేసే ట్రీట్మెంట్ 

ఇప్పించినా కేసే ఫోన్ చేసినా సతాయింపే

ఎవరి పోలీసుస్టేషన్ పరిధులు వారివే!


ప్రజల నుండి వినతులు వెళ్ళాక  కోర్టులు 

మానవత్వంతో మనసు మార్చుకున్నవి 

ఇప్పుడు ఆక్సిడెంట్ అయిన వారిని హాస్పిటల్ 

తీసుకెళ్ళి బ్రతికిస్తే లక్ష పారితోషికం సర్టిఫికెట్ 

ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐదు వేలు సర్టిఫికెట్ 


లాఠీలు వచ్చే వరకు ఆలస్యం అయ్యింది 

క్రింద మీద ఎండ మండి పోతుంది రుధిరం 

గడ్డ కడుతుంది అచేతనంగా బాధితులు 

పోలీసులు విచారణ చేసి హాస్పిటల్ కు

తీసుకుని పోయే మార్గ మధ్యంలోనే 

ప్రాణాలు ఆకాశంలో కలిసి పోయాయి!


పర్యాయ పదాలు:


రుధిర: రక్తం, నెత్తురు 


హౄదయ విదారకంగా : మనస్సు ద్రవించి పోయే విధంగా, చాలా బాధాకరంగా 


కర్కశంగా: కఠినంగా, గట్టిగా 


అచేతనంగా: లేవలేని స్థితి, చేతకాని తనం 


వినతులు: అప్లికేషన్లు, దయతో కూడిన పత్రాలు

సంతోషమా ఏది నీ చిరునామా

*నేటి అంశం*- *సంతోషమా ఏది నీ చిరునామా*


శీర్షిక: సంతోషాన్నినేనే! ఇదే నా చిరునామా!

ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసి నవమాసాలు మోసి,  ప్రసవించనపుడు బిడ్డ కెవ్వుమనే శబ్ధానికి తల్లిలో కలిగే ఆనందంలో....

తాను సృష్టించిన బిడ్డ,  అత్త అత్తా అమ్మ అమ్మా అనే పిలుపు వినబడినపుడు తల్లి హృదయంలో....

తల్లిదండ్రులు మానవత్వంతో గొప్ప పనులు చేస్తున్నప్పుడు జనులు ఆహా..! ఓహో..!అని  పొగుడు తుంటే , కొడుకు కూతుర్ల మనసులో కలిగే ఆనందంలో...

కడు పేద తనంలో, ఆపదలో ఉన్నవారిని,అనాధలను  ఆదుకున్నపుడు వారి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలినపుడు కలిగే ఆనందంలో....

ఆక్సిడెంట్ అయి రోడ్డుపై పడినప్పుడు, వెంటనే హాస్పిటల్ తీసికెళ్ళి రక్షించినపుడు వారు చూసే చూపులతో, మాట్లాడే మాటలతో కలిగే ఆనందంలో....

ఎవరికైనా రక్త దానం, అవయవదానం చేస్తే ఆ వ్యక్తి బ్రతికినపుడు అతని కళ్ళలో కలిగే ఆనందంలో....

అనాధ పిల్లలు అంగ వికలురుల వద్ద పుట్టినరోజులు జరుపుకుంటూ, వారికి చేతనైనది పంచినపుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసే మానవత్వ హృదయాలలో....

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను , వికలాంగ సోదరి సోదరీమణులను కంటికి రెప్పలా వారిని చూసుకుంటున్నపుడు వారి ఆనందంలో..  ఉంటాను