అంశం: గెలుపు అంటే ఏమిటి?
శీర్శిక: ఆదిపత్యం సాధించడం
గెలుపు అంటే!
*ఏ అవకాశాలులేని ఏ సదుపాయాలు లేని*
*కాలంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన*
*టెన్సింగ్ నార్కేది గెలుపు అంటే!*!
ఒక స్త్రీ గా ఉండి మొక్క వోని ధైర్యంతో
వ్యోమనౌకలో తొమ్మిది నెలలు
శూన్యంతో స్నేహం చేస్తూ భువికి దిగివచ్చిన
సునితా విలియమ్స్ ది గెలుపంటే!
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓటర్లకు
డబ్బు వెదజల్లో డబ్బు ఖర్చుచేసో గెలవడం
అది నేతల గెలుపు కాదు ముమ్మాటికీ
భార్య మీద భర్త భర్త మీద భార్య గెలవడం
గెలుపు ఎప్పుడూ కాదు
ఒక క్లాసులో ఇద్దరే ఉండి ఒకరు ఫస్ట్ ఒకరు
సెకండ్ రావడం గెలుపు కాదు
సానుభూతితో అభిమానంతో అదృష్టంతో
ప్రేమతో గెలిచిన గెలుపు గెలుపు కాదు
గెలుపులో పోటీ తత్వం ఉండాలి
ఆటలో ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తులు
పనులు మనసులు హృదయాలు ఉండాలి
గెలుపులో గెలిచే వ్యక్తి కృషి ఉండాలి
కల పట్టుదల క్రమశిక్షణ కాలం ఉండాలి
నీతి నిజాయితీ నిబద్ధత ధర్మం ఉండాలి
గెలుపంటే ఎదుటి వారిపై , ఎదుటి శక్తులపై
ధర్మంగా ఆది పత్యం సాధించడం!
No comments:
Post a Comment