Tuesday, April 15, 2025

నభూతో నభవిష్యత్

*నభూతో న భవిష్యత్*

ఇది కళా! నిజమా!
అని అని పించింది రామదాసు ద్వితీయ వార్షికోత్సవం మరియు పుస్తకాల ఆవిష్కరణ
సభ ఆద్యాంతం.
డాక్టర్ రాధా కుసుమ మేడం గారి అద్యక్షతన, డాక్టర్ అరవ రవిందర్ బాబు గారు కవులతో పూర్తి కవితలను చదివిస్తూ, చక్కగా సమీక్షలు చేశారు.
కొన్ని చోట్ల పూర్తిగా చదవటం అనేది జరుగదు.

చక్కని క్రమ శిక్షణ, నిబద్దత సమయపాలనతో
భీమా శ్రీనివాస్ గారు ఇంకా ఎనిమిది నిమిషాల,  ఇంకా ఐదు నిమిషాల టైం ఉందంటుంటే నాకు 1979 లో M.Com ఎంట్రెన్స్ టెస్ట్ గుర్తుకు వచ్చింది.

అధ్యక్షులు శ్రీ రామ కృష్ణ చంద్రమౌళి గారు
సభను సమయస్ఫూర్తితో మధ్య మధ్యన చక్కని చలోక్తులతో హూందాగా నడిపించారు

ముఖ్య అతిధి డాక్టర్ వి.డి. రాజగోపాల్ గారు చక్కని ప్రసంగం చేశారు
ఆధ్యాత్మికం సామాజిక, ప్రకృతి సంబంధించిన కవితలే కాకుండా, ప్రభుత్వ అవినీతిపై కవులు స్పంధించాలని సూచించారు. మంచి ఆలోచన .
వ్యవస్థాపక అధ్యక్షులు కనుక అలాంటి అంశాలు ఇవ్వగలుగుతే కవులు వ్రాస్తారు, బుక్ ప్రింట్ చేయవచ్చు.

ఇతర వక్తలు చంద్రశేఖర్ గారు, డా. రవిందర్ బాబు గారు, భీమా శ్రీనివాస్ గారు, నారాయణ రావు గారు, అడిషనల్ డి.సి.పి తేజావత్ రామదాసు గారు, డాక్టర్ రాధా కుసుమ మేడం గారు, గూండ్ల నారాయణ గారు సంస్థ గురించి మరియు దూత రామకోటేశ్వర్ రావు గారి గురించి చక్కని విషయాలు తెలియజేశారు,ఉత్తేజ భరితంగా ప్రశంసించారు.

ఈ రోజుల్లో కొన్ని సాహితీ సంస్థలు వ్యాపార ధోరణితో నడుపుతున్నాయి. ఏదో ఖర్చుల కోసం పరస్పర సహకారం అంటే పర్వాలేదు కానీ, ఒక్కో కవి వద్ద వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఏ లాభాపేక్ష లేకుండా, ఒక్క రూపాయి కూడా కవుల వద్ద వసూలు చేయకుండా,
కవులు సంబ్రమాశ్చర్యాలతో తేలిపోయేటట్లుగా, మూడు పుస్తకాలు ఆవిష్కరణ చేయడం, సస్పెన్స్ థ్రిల్లర్ గానూ , కవుల బిరుదుల కొరకే ఒక బుక్ ప్రింట్ చేయడం, కవులకు మెమెంటో లతో పాటు,  దానిపైననే ఫోటో మరియు బిరుదు ను ముద్రించడం, నా భూతో నా భవిష్యత్!

సన్మానం చేయడం కూడా శ్రీ భీమా శ్రీనివాస్ గారు కవులను ఒక్కొకరిని పిలుస్తూ, అప్పుడు బిరుదు ప్రకటిస్తూ, ముఖ్య అతిధులతో శాలువా కప్పిస్తూ, మెడలో మాల వేస్తూ, రాజా వారి టోపీ పెడుతూ
ఫోటోలు తీయిస్తూ సన్మానాలు చేసే తీరు నా భూతో నా భవిష్యత్తే కదా, అదియును ఇన్టైమ్ లో..!

చివరగా రామదూత సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దూత రామ కోటేశ్వరరావు గారి ప్రసంగం కవిత వందన సమర్పణ కవుల కరతాళ ధ్వనులతో కవి సమ్మేళనం మారు మ్రోగింది.

కవులకు ప్రతి రోజూ వినూత్నమైన అంశాలు ఇస్తూ,
చక్కని కవితలు రాయిస్తూ, వారం వారం ఇ పత్రికలో ప్రచురిస్తూ, రెగ్యులర్ ఉద్యోగం చేస్తూనే, ఎంతో సహనంతో ఏ రోజు కారోజు చక్కని ప్రశంసా పత్రాలు ఇస్తూ, మధ్య మధ్యలో మరియు వార్షికోత్సవాలలో
గొప్పగా వినూత్నమైన రీతిలో సన్మానిస్తూ ,
ఇంత చక్కగా ప్రోత్సహిస్తున్న శ్రీ దూత రామ కోటేశ్వరరావు గారికి కవులందరూ ఋణపడి ఉంటారనడంలో సందేహం లేదు.

ఒక పురుషుడి అభివృద్ధి లేదా కీర్తి ప్రతిష్టల వెనుకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. ఇక్కడ వారి సతీమణి ప్రోత్సాహం మరియు వారి కూతుర్లు కావ్య &  కళ్యాణి గార్ల సహాకారం ఎంతో ఉంది అనడం అతిశయోక్తి కాదు.

మధ్య మధ్యలో టీ లు, స్నాక్స్, మజ్జిగ చివరగా చక్కటి సాత్విక భోజనం అందించారు
ఆ తదుపరి మూడు పుస్తకాలు ఇచ్చారు.

ఇంత మంచి ప్రోత్సాహం సన్మానాలతో సత్కరించిన శ్రీ దూత రామ కోటేశ్వరరావు గారికి వారి సతీమణి శ్రీమతి రామలక్ష్మి గారికి కూతుళ్లకు మరియు అండదండలు అందిస్తున్న సమూహ కార్య నిర్వాహక సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు

రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఇలాంటి మరిన్ని శత, సహస్ర వార్షికోత్సవాలు జరుపుకోవాలని , అవార్డులు రివార్డులు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

No comments: