Saturday, April 26, 2025

బూరలు బుడుగలు/ బాల గేయం


అంశం:బూరలు/బుడుగలు

శీర్షిక: పుట్టిన రోజు పండుగ 

              గేయం 


అక్కా అక్కా బుడగలూ... 

అన్నా అన్నా బుడుగలూ... 

రంగు రంగుల బుడుగలూ... 

నాన్న తెచ్చాడు బుడగలూ....!       "అక్కా"


పుట్టిన రోజు పండుగా....

బుడుగలుంటేనే మెండుగా....

ఇల్లు ఉంటుంది నిండుగా....

అమ్మా నాన్నలు ఉండగా....!           "అక్కా"


దారం బిండా తేవాలీ....

బుడుగల నిండుగా ఊదాలీ....

గట్టిగ ముడులు వేయాలీ...

పొడుగుగ దారం కట్టాలి.....!            "అక్కా"


గుమ్మాలకు బుడుగలు కట్టాలీ 

నెల వంకలా బుడగలు చుట్టాలీ ...

తొరణాలుగా బుడగలు కట్టాలీ....

విడిగా నేలపై బుడగలు వేయాలీ....!     "అక్కా"


కొవ్వొత్తులు వెలిగించాలీ....

ఉఫ్ ఉఫ్ మని ఊదాలీ....

మధ్య మధ్యలో బుడగలు పేల్చాలీ...

చల్లని కేకును కట్ చేయాలీ...

చాక్లెట్లు పిల్లలకు పంచాలీ..

బహుమతులు తీసుకోవాలీ...

అమ్మా నాన్నకు దండం పెట్టాలీ...

చాక్లెట్లు పిల్లలకు పంచాలీ.....                "అక్కా"


No comments: