Tuesday, April 29, 2025

సుభాషితాలు/యమకాలంకారాలు

శీర్షిక: *సుభాషితాలు*

(యమకాలంకారాలు)

*కలుపు* గోలుగా కూలీలు పనిచేస్తే *కలుపు* సులువుగా తీయవచ్చు...

ఇష్ట దైవానికి వం *దనం* చేస్తే తప్పక  *ధనం* లభిస్తుంది...

వసుం *ధర* షాపులో గట్టిగా మాట్లాడకపోతే*ధర* పెంచే వాడు కాదు....

*అన్న* మయ్య కీర్తనలతో తిరుపతిలో భక్తులకు
*అన్న* ము సమృద్ధిగా లభిస్తుంది...

ఎవరీ సాయి *బాబా*  తాను *బాబా* లకు దేవుడు కావచ్చు కానీ, హిందువులకు దేవుడు ఎప్పటికీ కాదు. సాయిబాబా కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? హిందువులారా ఇకనైనా మేల్కోండి.

*చల్ల* చల్లని పెరుగును చిలికితే  *చల్ల* అవుతుంది..

బల *రాముడు* ఎప్పుడూ బల రాముడే కానీ *రాముడు* కాలేడు...

మం *దారాలు* తోరణాలు కట్టాలన్నా *దారాలు* కావాల్సిందే...

*రాజు* అనే వాడు సమతూకం చూసే త *రాజు* లా
ఉండాలి...

ఏ దేవా *లయం* వెళ్ళినా  మనస్సును దేవుడిపై *లయం* చేయాలి...

*అన్న* అని పిలిచి  *అన్న* మని అడుగు తప్పక పెడుతాడు...

చిన్ని గో  *పాలు* డికి  పెంపుడు తల్లి యశోద నే  *పాలు* పట్టేది....

*వేల* డంత లేని నేతల కొడుకులు  వేలకు *వేలు* లక్షలు కోట్లు ఖర్చుపెడుతున్నాడంటే, అది అవినీతి సొమ్ము కాదా..

మనిషి అన్న వాడు  మ *రణం* తో  ప్రతినిత్యం *రణం* చేస్తూనే ఉండాలి....

No comments: