Tuesday, April 8, 2025

సైన్స్ అందని సత్యం

 శీర్షిక: *సైన్సుకు అందని సత్యం*


వినీలాకాశంలో నక్షత్రాలు 

పరుగులు పెడుతున్నాయి 

అవనిలో అంధకారం అలుముకుంది

విశ్వం నిశ్శబ్దం ఆవహించింది

పండు అమావాస్య రోజు

జనులు పశు పక్షాదులు

నిద్రలోకి జారుకున్నాయి

రాత్రి సూరీడు వచ్చేవేళ 

దగ్గర బడుతుంది


రాజు తమ వాహనాలకు

వార్తను అందించారు 

అవి ఆ ఇంటి దగ్గరలో 

దక్షణం వైపున కూర్చుని 

బోరుమని రోధనలు చేస్తున్నాయి


ఏమి జరుగుతుందో 

యేమి జరుగబోతుందో 

ఎవరికీ తెలియని 

అయోమయ పరిస్థితి 


రాజు  ఆజ్ఞ మేరకు

కత్తులు కఠారులు పట్టుకుని 

త్రాళ్ళు పలుగులు పుచ్చుకుని

దక్షణం నుండి భటులు వచ్చారు

ఆ భటులు ఎవరో కాదు, యమ దూతలు 


వచ్చిన విషయాన్ని చెప్పారు 

మర్యాదగ వస్తావా  లేక 

మమ్మల్ని ఎత్తుకు పొమ్మంటావా 

అని గద్ధించారు 


అంతే, 

ఆ తల్లి ఎవర్రా మీరు అంటూ

కాళికా దేవిలా గర్జించింది

బడితే చేతిలో బుచ్చుకుంది 

నాకు ఇంకా బ్రతకాలని ఉందిరా 

నా ఇల్లును ఇంకా అమ్మలేదురా 

నాకు ఇంకా ఎన్నో పనులున్నాయిరా 

అంటూ తరిమి తరిమి కొట్టింది 

ఒక్కసారే, అమ్మ వారిలా

విశ్వరూపం చూసేసరికి 

యమదూతలకు బయం వేసి

వినేటట్లు లేదని , చేసేది ఏమీ లేక 

వెంట తెచ్చుకున్న  అస్త్ర శస్త్రాలతో

యమధర్మరాజు వద్దకు బయలు దేరారు 


గెలిచిన విజయోత్సాహంతో 

ఆ తల్లి అదే నిండు నిశి వేళ 

స్నానం గావించి

ఆనందంగా నిదురలోకి జారుకుంది


మరికొన్నాళ్లకు 

ప్రతి రోజు పగలు కొడుకు కోడలుతో

సేవలు చేయించు కోవడం 

రాత్రి వేళల్లో తన వారిని 

అమ్మ అక్క మనుమరాలా 

అంటూ పిలవడం

తమ్ముళ్ళను, మరుదండ్లను 

తలుచుకోవడం 

వారు స్వర్గం నుండో నరకం నుండో

ఆ తల్లి వద్దకు రావడం

వారితో చిన్న నాటి సంఘటనలు

బాధలు చెప్పడం, వారు చెప్పేది వినడం 

నిత్య కృత్యంగా మారింది


పొద్దస్తమానం వారితోనే 

ముచ్చట్లు అచ్చట్లు 

చీదరింపులు బెదిరింపులు

తిట్ల పురాణాలు 

అప్పుడే, ప్రేమలు గార్వాలు, 

అలకలు ఊరడింపులు 


పాలు పోస్తుంటే 

భోజనం వడ్డిస్తుంటే

తన వారికి పెట్టమని

బ్రతిమి లాడుతుంది

ఇప్పటికీ అమ్మన్నా, అక్కన్నా

తన వారన్నా ఎంత ప్రేమో !


ఏరి వారు అని గట్టిగా ప్రశ్నిస్తే 

ఇదుగో ఇప్పుడు ఇక్కడే ఉండిరి బిడ్డా

అని అంటుంది

సరే అని కొడుకు, నేను తీసుకెలుతున్నాను 

మీ అమ్మకు బయట భోజనం పెడుతాను అంటే 

చిన్న పిల్లలా ఇక తీసుకపోతవులే అంటూ

ముసిముసి నవ్వులు నవ్వుతుంది 


ఆ తల్లి తిన్నా తినకున్నా 

తనకు పెట్టిన అన్నంలో

కొంత తీసి అమ్మా అమ్మా అంటూ 

అక్కా అక్కా అంటూ

పిలిచి వారికి వేరే రికాపులో పెడుతుంది


పన్నా పడుకోకున్నా , 

ఓ మూలకు పడుకుని

తన మంచం పైన చోటిచ్చి 

బ్లాంకెట్ వారికి నిండుగా కప్పుతుంది 

చాలామంది వస్తె వారికి చాప వేస్తుంది


తెల్లవారు కొడుకు కోడలు చూస్తే 

మరో రికాపులో అన్నం దర్శనం 

ఇదేమిటంటే, వాల్లకు గర్ర వచ్చింది

తినలేదు బయట పారేయంటుంది 


తెల్లవారేసరికి, నిద్ర మబ్బు వదలగానే

బయటకు వచ్చి వారు ఏరిరా,

మా అమ్మ పిల్లలు ఏరిరా అంటుంది


నిత్యం ఇదే తంతు 

ప్రతినిత్యం ఒక వింత దృశ్యం 

ఎవరికీ అంతుచిక్కని చిత్రం

అంతా సృష్టి మహత్యం

సైన్సుకు అందని సత్యం 

సిల్వర్ లైన్ కలిసి ఉండటం వలన

సగం భువిలో, సగం దివిలో

గడిపే ఆ నూరేళ్ళ తల్లి 

మరో నూరేళ్ళు జీవించాలని

కోరుకుందాం


No comments: