శీర్షిక: *సాహిత్య స్వప్నం - నందిని సిధారెడ్డి*
ప్రక్రియ: ముత్యాల హారాలు
(రూపకర్త: శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు)
01.
అతి నిరాడంబరుడు
ఎంతొ వినయ శీలుడు
సాహిత్య జిజ్ఞాసకుడు
తెలంగాణ ధీరుడు!
02.
కత్తుల సిద్ధారెడ్డి
నర్రా సిద్ధా రెడ్డి
నందిని సిద్ధా రెడ్డి
అయె *నందిని సిధారెడ్డి*
03.
బాపు బాల సిధారెడ్డి
తల్లి రత్న మాలరెడ్డి
జన్మించె కులం రెడ్డి
*నందిని సిధారెడ్డి!*
04.
ఇరువది రెండు జూన్ న
యాబయైదు వత్సరాన
మారుమూల, గ్రామాన
జన్మించె రెడ్డి కులమున!
05
రెడ్డి జన్మస్థలము
బందారం గ్రామము
కొండ పాక మండలము
తెలంగాణ రాష్ట్రము!
06.
వ్యవసాయ కుటుంబము
గ్రామ వాతావరణము
జానపదుల ప్రభావము
గడిపె అలా జీవనము!
07.
ధర్మపత్ని *మల్లేశ్వరి*
భర్త మనసెరిగిన నారి
కూతురు *వీక్షణ* శిఖరి
నందిని కుటుంబాన సిరి!
08.
కవిత్వమంటే యిష్టము
వ్రాయాలని ఉబలాటము
చేతిలో లేదు పైకము
మిత్రులే అయిరి వరము!
09.
సాహిత్యంలో మేటి
మాటల్లో వాగ్ధాటి
వ్రాసె మిత్రులతో *దివిటి*
తెచ్చెను, ప్రశంసలు కోటి!
10.
పడెను ఎన్నో కష్టాలు
గడించెను అనుభవాలు
ఉన్నతికి సోపానాలు
వేసెను అవే పునాదులు!
11.
చార్జీల్లేని పరిస్థితి
ఉపవాసముండే స్థితి
అడుగలేక పోయెమతి
శివారెడ్డే ఆయె గతి!
12.
*చాలేటి నాగల్ల* అను
అద్భుత కవిత రచించెను
దాన్ని పాటగా మలిచెను
నంది అవార్డు గెలిచెను!
13.
స్థాపించే *మంజీర* ను
రచయితల సంఘమును
ఒక *బులిటన్ మంజీర*ను
ఇచ్చె రెడ్డికవి ధీరను!
14.
కవిత్వమంటే ప్రాణము
తరగతులకు దూరము
ఉండెను ఎంతో కాలము
సాధించెను కీర్తి ఘనము!
15.
విప్లవ సాహిత్యము
అనిననూ అభిమానము
వివాదలకు దూరము
సహజ మనస్థత్వము!
16.
పట్టుదల గలవాడు
గొప్ప విద్యావంతుడు
ఎం.ఫిల్. అంశం *సూర్యుడు*
పి.హెచ్. డి పూర్తి చేశాడు!
17.
మాట మహా శ్రావ్యము
చూపు చాల గంభీర్యము
తెరపై పేరు రావడము
వీరి చిరకాల స్వప్నము!
18.
గురువులను తలుస్తాడు
మిత్రులను కలుస్తాడు
శిష్యుల పలుకరిస్తాడు
జన్మభూమిని మరువడు!
19.
గొప్ప పోరాట యోధుడు
నిష్కల్మష హృదయుడు
వక్త , ఉపన్యాసకుడు
గొప్ప కవి , విమర్శకుడు!
20.
*భూమి స్వప్నం* రచించె
*సంభాషణ* ను రచించె
*ప్రాణహిత* ను రచించె
మరెన్నిటినో రచించె!
21.
రెడ్డి గారూ పద్య కవి
గేయాలు, పాటల కవి
కవితలు మరియు కథల కవి
యింకనూ నాటికల కవి!
22.
తెలంగాణ రాష్ట్రానికి
సాహిత్య అకాడమికి
తొలి చైర్మన్ పదవికి
అది వన్నెతెచ్చె వీరికి!
23.
రాష్ట్రం ఏర్పడ్డాకను
తెలుగు మహాసభలను
ఘనంగా జరిపించెను
అవి కీర్తి తెచ్చిపెట్టెను!
24.
ఉద్యోగ భాద్యతలలో
కుటుంబ భాద్యతలలో
సాహిత్య అభిరుచులలో
పాటించె సమపాళ్లలో!
25.
దాశరధి *ఫీవర్స్ ఫ్రంట్* ను
*విశ్వకళాపీఠ* మును
ఎన్నో పురస్కారాలను
వినయముతో అందుకునెను!
No comments:
Post a Comment