Friday, April 11, 2025

తేనే పూసిన కత్తి ఆన్లైన్ బెట్టింగ్

అంశం: ఆన్లైన్ బెట్టింగ్ 


శీర్షిక: *తేనే పూసిన కత్తి ఆన్లైన్ బెట్టింగ్*


ఆన్లైన్ బెట్టింగ్ అనునది ఒక ఊబి లాంటిది 

ఒకసారి దిగారో రారు ఇక బయటకి

బెట్టింగ్ ఆట ఒక *తేనే పూసిన కత్తి లాంటిది*

సోషల్ మీడియా దానికి అద్భుతమైన వేదిక 

అందరి చేతులుంటాయి అందులో చెక్కుచెదరక!


క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ రమ్మీ క్యాసినో ఫోకర్ 

అనేవి ఆన్లైన్ బెట్టింగ్ గేములు 

వీటికి ఉంటాయి రకరకాల ఆప్ లు

సినిమా రంగంలో ఉన్నారు బెట్టింగ్ మాఫియాలు!


మొదట చిన్న చిన్న మొత్తాలతో ఆడిస్తారు 

డబ్బు గెలుచు కున్నట్లు ఆశలు పెంచుతారు 

పెద్ద మొత్తాలను డిపాజిట్లు చేయిస్తారు 

ముందే ప్రోగ్రాం చేసిన సాఫ్ట్వేర్ తో

డిపాజిట్ చేసిన డబ్బుల్ని కొట్టేస్తారు!


బోనస్ లని  గిఫ్ట్ లని ఎరవేస్తారు 

అవి రావాలంటే బెట్టింగ్ ఆడాలంటారు 

అందమైన అమ్మాయిలతో మాట్లాడిస్తారు 

అక్కడక్కడ ఏజెంట్లను నియమిస్తారు 

యూట్యూబ్ లలో ఫేక్ ప్రచారంచేయిస్తారు!


బ్యాంకు ఖాతాలను పర్సనల్ వివరాలను 

సేకరించి ఇతరులకు అమ్మేస్తుంటారు 

బ్యాంకు అకౌంట్లను ఖాలీ చేయిస్తారు 

ఆస్తుల వివరాలు సేకరించి అప్పుల ఊబిలోకి దింపుతారు!

 

డబ్బు పోగొట్టుకున్న చోటనే సంపాదించుకోవాలని

మరిన్ని అప్పులుచేస్తారు,ఇక అప్పులుపుట్టక 

తెచ్చిన అప్పులు తీర్చలేక యువకులు 

పురుగుల మందులు త్రాగుతూ 

ఉరిబిగించుకుంటూ ఆత్మహత్యలకు 

పాల్పడుతున్నారు ,భార్యా పిల్లలను 

తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు 


ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని బెట్టింగ్ 

ఆప్ లను బ్యాన్ చేయాలి 

బెట్టింగ్ మాఫియాపై కఠినచర్యలుతీసుకోవాలి 

ప్రజలు చైతన్య వంతులు కావాలి!


No comments: