Tuesday, April 15, 2025

ఒక మాయని మచ్చ

అంశం:మనో వేదన


శీర్షిక: *ఒక మాయని మచ్చ*

*రాముడు వేసిన బాణం వృధాగా పోదు*
*కారణం ఏదైనా సమయం ఏదైనా*
*మనసు తగిలిన గాయం సులభంగా మానదు*

శరీరానికి మనసు సెంట్రల్ ప్రాసెసింగ్
యూనిట్ గా  భావించవచ్చు
పంచేంద్రియాల ద్వారా మెదడుకు
సందేశం అందంగానే అది క్షణాలలో
మనసుకు అంద జేస్తుంది!

మంచి విషయాలైతే ముఖం ఆనందంతో
పరవళ్ళు తొక్కుతుంది
చెడు బాధాకర విషయాలైతే ముఖం
దుఖ సాగరంలో మునిగి పోతుంది
అందుకే *ముఖం మనసుకు ప్రతిబింబం*
అని అంటారు

అందుకే రాముడు బాణం వేసే టపుడు
ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడు
మనిషి మాట్లాడే టప్పుడు
ఒకటికి నూరుసార్లు ఆలోచించాలి

శరీరానికి గాయమైతే
రెండు మూడు రోజులలో మాయమవుతుంది
అదే మనసుకు తగిలిన గాయం మానడానికి
అదే మనో వేదన తగ్గడానికి
రోజులు వారాలు నెలలు సంవత్సరాలు
పెట్టవచ్చు లేదా పుణ్యకాలం గడువవచ్చు

ఎదుటి వారిని ఒక మాట అనే టప్పుడు
అదే స్థానంలో మనం ఉంటే
ఎలా మనో వేదన చెందుతామో గ్రహిస్తే
ఇతరులను అనడం తగ్గుతుంది

రామాయణంలో దశరధుడిని
తాను ఇచ్చిన మూడు కోరికలను
కైకేయి తీయగానే కోరింది
కానీ అవి మనో వేదనకు గురి చేయడం వలన
దశరధుడు పుణ్యకాలం చేసాడు

ఒక సారి గౌతమ బుద్ధుడిని
పరుషమైన పదజాలంతో ధూషించించింది
మనో వేదన చెందక చిరునవ్వుతో
ముందుకు సాగాడు
శిష్యులడిగిన ప్రశ్నకు ఆ స్త్రీ అనిన మాటలు
నేను స్వీకరించ లేదు అన్నాడు తాపీగా!

కొందరు స్థితప్రజ్ఞులు ఉంటారు
మొండి వారు ఉంటారు
వారిని ఎంత కఠినంగా నిందించినా
పెద్దగా స్పంధించరు మనోవేదనకు గురికారు

హర్షద్ మెహతా మాజీ ప్రధాని పీవీ
నరసింహారావు కోటి రూపాయల
ఇచ్చానని నింద వేశాడు
పి.వి. బెదరకుండా సీత లాగా బయటకు
వస్తా అన్నాడు అలానే వచ్చేసాడు!

బలహీన మనష్కులే తొందరగా
మనోవేదనకు గురి అవుతారు బాధ పడుతారు
అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు
మనసుకు తగిలిన గాయం *ఒక మాయని మచ్చ*


No comments: