*అంశం* : పురుషుడా నీకు శతకోటి వందనాలు!
మానవ మనుగడకు పునాది
ఎక్కడా గుర్తింపు దక్కని యానాది
ఎవరి ప్రేమకు నోచుకోని వాడు
పురుషుడు ఇంటికి నిట్టాడు
కుటుంబానికి వెన్నెముక లాంటివాడు
చివరికి ఏ కవి కలానికి అందని వాడు
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు
పురుషుడు లేకుండా ఈ సృష్టే లేదు
క్రొవ్వొత్తిలా కాలుతూ వెలుగును పంచు త్యాగశీలి
ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం పురుష జన్మం
అది ఎవరికీ అంతు చిక్కని సృష్టి మర్మం
ప్రేమను పంచితే నాన్నలా ఆదరించి ప్రాణమిస్తాడు.
అవమానిస్తే కాళ రుద్రుడై కోపంతో
తన మూడో కన్ను తెరుస్తాడు.
పురుషుడి మూలధాతు లేకపోతే జననం లేదు
పురుషుడి ఉనికి లేకపోతే మనుగడ లేదు!
పురుషుడు ఈ జగతికి సృష్టికర్త
అతడు ఎంతో మందికి ఆదర్శప్రాయుడు
తన పుప్పొడి లేకుండా స్త్రీ గర్భం దాల్చదు
అమ్మ బిడ్డను నవమాసాలు కడుపులో మోస్తే
నాన్న నవవత్సరాలు బుజాన మోస్తాడు
పురుషుడు ఈ సృష్టికి మూలాధారం
అతడు లేకపోతే ఈ విశ్వమే శూన్యం!
పురుషుడు తండ్రికి తగ్గ కొడుకుగా
వంశానికి మూలపురుషుడుగా
ఇంటి పేరును నిలబెట్టే యోగ్యుడిగా
ఇంటి సంసార భారం మోయు భాద్యుడిగా
నాన్న అనే పిలుపుకు త్యాగమూర్తిగా
ప్రేమను పంచడంలో తండ్రిగా
బిడ్డలకు సేవకుడిగా
భార్యకు అర్ధ నారీశ్వరుడిగా
తల్లిదండ్రులకు భాద్యుడిగా సేవకుడిగా
కుటుంబ బాధ్యతలో తండ్రిగా
అన్నదమ్ములకు అండగా
ఆడపడుచుల ఆదుకును పెద్ద దిక్కుగా
అడపడుచుల బిడ్డలకు మేనమామగా
సాంప్రదాయాలను పరిరక్షించుటలో
ఆత్మ బంధువుగా కోపంలో రుద్రుడిగా
సహాయంలో స్నేహితుడిగా
భరతమాత ముద్దుబిడ్డగా
నవరస పాత్రలను పోషించు పరమాత్ముడు!
గొడుగుకు పై కప్పు లాంటివాడు
తాను మరో జన్మ నెత్తి మనకు మరో జన్మిస్తాడు
పిల్లల కోసం తన కన్న కలల్ని
భవిష్యత్తును త్యాగం చేస్తాడు పురుషుడు
అహర్నిశలు భార్యా పిల్లల కొరకు కష్టపడుతాడు
జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తాడు
అయినా బిడ్డకు తండ్రి ఎవరో ధైర్యంగా
చెప్పుకోలేని దురదృష్టవంతుడు పురుషుడు
పురుషుడిపై ఓ ప్రేమ దయ కరుణ కనబడదు
ఓ పొగడ్త ఉండదు తెగడ్త మినహా
ఒంటరి వాడైతే ఇక భారమే జీవితం!
ఏడ్వడానికి కూడా నోచుకోలేని వాడు
బాధలను ఏడుపుతో ఉపశమనం పొందలేక
కన్నీరును కార్చే స్వేచ్ఛ లేక ప్రశాంతత కరువై
గుండె పోటులతో కాలం చేసే వాడు
సృష్టి లోనే ఆయుషు తక్కువగా ఉన్నవాడు
కన్నీరును కనురెప్పల మాటున దాచిపెట్టి
కష్టాలను నష్టాలను దుఃఖాలను
వ్యధలను ఎవరికీ కనబడనీయకుండా
తనలోనే దిగమ్రింగేవాడు పురుషుడు
ముక్కున్నంత కాలం పడిశెం తప్పదన్నట్లు
కామకోర్కెలు ఉంటాయి స్త్రీ పురుషులకు
ఆకుమీద ముల్లుపడ్డా ముల్లుమీద ఆకుపడ్డా
తప్పెవరిదో పరిశోధన చేయకుండా
పురుషుడి పైననే నిందెలు అవమానాలు
సపోర్టుగా పురుషులకు సంఘాలు లేవు
ఉన్నా ధర్నా చేయడానికి ముందుకు రావు
కాదని చెప్పినా చట్టాలు కనికరించవు
చివరికి పురుషులకు మరణమే శరణ్యం
అందుకే చీకూ చింతా లేని సహజీవనానికి
అలవాటు పడిపోతున్నాడు పురుషుడు
ఓ పురుషుడా నీకు శతకోటి వందనాలు!
No comments:
Post a Comment