*కుసుమ ధర్మన్న కళాపీఠం:*
*19/04/2025**శనివారం*
*నేటి అంశం : *మా వాక్యం-మీ కవిత్వం*
శీర్షిక: *ఊహల పల్లకియై*
దారం తెగిన గాలిపటంలా
తాడూ బొంగరం లేని ఆలోచనలతో
థార్ ఎడారులలో ఒంటరిగా
తిరుగుతున్న నాకు .. ఒయాసిస్ లా
*నీ తలపులే నాకు ఊపిరిగా*
*మారిన ఈ వసంతంలో*
*నీలో దాగిన స్వరం నా కవిత్వం అవుతుంది*
నీ హృదయం నా ఊహల పల్లకియై
గగనంలో తేలిపోతున్న నా మనసుకు
చుక్కానివి నీవే అని తెలిసిపోయింది
నా ప్రేమకు లంగరు వేసింది!
ఇది కలయో నిజమో తెలియకుండా
నా కనుల నిండా నీపై ధ్యాసనే మంచులా
కప్పుకుని పోయింది!
గలగలా పారే గోదావరిలా మాటలాడే
నీ మధుర పలుకులు
తళతళ మెరిసే చంద్రబింబం లాంటి
నీ సుందర మోము
తామరతూడు లాంటి నీ నడుము
పురి విప్పిన మయూరిలా
వయ్యారంగా నడిచే నీ నడక
నా మదిలో ఇంకనూ కదలాడుతునే ఉంది!
రతీ! నీ ప్రేమ కోసం నీ రాక కొరకు
ఈ మన్మధుడు వేయి కళ్ళతో
ఎదిరి చూస్తూనే ఉంటాడు..
దిగంతము ఎదిరి చూస్తూనే ఉంటాడు!
No comments:
Post a Comment