అంశం:తియ తీయని పలవరింత
శీర్షిక: *నా కలల స్వప్నం*
జల జల జారే జలపాతంలా
గల గలా పారే నిండు వరద గోదావరిలా
పచ్చని మైదానంలో పురి విప్పిన మయూరంలా
హొయలు ఒలికిస్తున్నావే ఓ నా మధుర వాణి!
మనసుకింపైన మధురాతి మధురమైన
నీ సుందర మాటలకు ఒళ్ళు పులకరించి పోతుంది
నీవు విసిరే ఆ వలపు వెన్నెలకు
జాబిలి సిగ్గు పడుతున్నట్లుగా
మనసు పూదోటలో విహరిస్తున్నట్టుగా
మేను ఆకాశంలో తేలి పోతున్నట్లుగా ఉంది!
లేలేత కిరణాల వంటి నీ చూపులతో
నావనైన నాకు లంగరు వేసి కదలకుండ చేస్తివే
చంద్ర బింబం లాంటి నీ మోముతో
ముసి ముసి నవ్వులతో మెరిసి పోతుంటివే!
ఎంతో కాలంగా నేను కట్టుకున్న కలల వారధి
నేను కంటున్న *నా కలల స్వప్నం*
నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది అన్నట్లుగ
నీ వలపులు తియ తీయని పలవరింతలతో!
No comments:
Post a Comment