*నేటి అంశం: *ప్రేమంటే*
శీర్షిక: *ప్రేమ పూర్వ జన్మ సుకృతం*
ప్రేమ అనేది ఒక కళ ప్రేమ అనేది ఒక అల
ప్రేమ అనేది ఒక వల
ప్రేమ ఇరువురి పంచేంద్రీయాల ఐక్యత
ఇద్దరి భావోద్వేగాల మేళవింపు
ఉభయుల ఆత్మీయ మనసుల కలయిక
బిడ్డ పైన తల్లిదండ్రుల ప్రేమ
తల్లిదండ్రులపైన బిడ్డ ప్రేమ
సోదరి పైన సోదరుల ప్రేమ
సోదరులపైన సోదరి ప్రేమ
ప్రియురాలు పై ప్రియుడు ప్రేమ
ప్రియుడు పైన ప్రియురాలి ప్రేమ!
భార్య పై భర్తకు ప్రేమ భర్తపై భార్యకు ప్రేమ
ప్రేమ ఏదైనా కావచ్చు ఎవరిమీద నైనా కావచ్చు
ఎందుకు పుడుతుందో అది ఎప్పుడు పుడుతుందో
ఎవరికి తెలియదు
అది ఎంత కాలమైనా ఉండవచ్చు
ఏదీ శాశ్వతం కాదు ఏదీ అశాశ్వతం కాదు
పాలు పంచదార తేనే నెయ్యి నీరు అనెడి
ఐదు పదార్ధాలు కలుస్తేనే పంచామృతం
పంచామృతం ఎంతో మధురం
అలానే పంచేంద్రియాల ప్రభావమే ప్రేమ
నిజమైన ప్రేమ ఎంతో మధురంగానూ
తీయగానూ ఉంటుంది
అతి ప్రేమ అనర్ధ దాయకం విషదాయకం కూడా
ప్రేమ ఒక్కో సారి కఠినంగా మారుతుంది
పాషాణంగా మారి విషాదాంతం అవుతుంది
అందుకే అంటారు ఆత్రేయ గారు;
*ప్రేమ ఎంత మధురం ప్రియురాలు మనసు*
*ఎంత కఠినం* అని ఒక సినిమాలో
నేటి కాలంలో ప్రేమలన్నీ ఒక నటన
అధిక శాతం వ్యాపార సంబంధాలే
అవి ఎప్పుడు మొదలవుతాయో
ఎప్పుడు అంతమవుతాయో ఎవరికీ తెలియదు
*ప్రేమ పూర్వ జన్మ సుకృతం*
No comments:
Post a Comment