Thursday, April 17, 2025

దేశానికి బరువే

*నేటి అంశం :*సామెతలు*

*మాట తేనె లొలుకు*
*మనసంతా విషం తీరు*

శీర్షిక: *దేశానికి బరువే*

*మనిషి పేద గానీ మాటకు కాదు కదా*
మాటలు కోటలు దాటుతాయి
అందాలు ఒలక బోస్తారు చిందులు వేస్తారు
ఆకాశ హార్మ్యాలు చూపిస్తారు!

మృదు మధుర మాటలతో
హావ భావాలతో అనూహ్య వేషధారణతో
తేనే లొలుకు పలుకులతో
సాన్నిహిత్యం పెంచుకుటారు!

మనసులో పాగ వేస్తారు
హృదయంలో ఒదిగి పోతారు
వంచించుతారు ఆపైన వణికిస్తారు
అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తారు
ఇది అడుగడుగునా నేటి లోకం తీరు!

మనసు నిండా విషమే
మాటలన్నీ మాయనే
వేషాలన్నీ అరువే
ఇంట్లో అంతా కరువే
ఇలాంటి వారు దేశానికి బరువే!

No comments: