Monday, April 14, 2025

ప్రతి ఐదేండ్లకూ ఇదే తంతు

శీర్షిక: *ప్రతి ఐదేండ్లకూ ఇదే తంతు* 


జనుల సొమ్ములను

జనులకు పంచడంలో

ఎందుకంత అసహనం? 


జనుల సొమ్ములను

దోచి దాచడంలో

ఎందుకంత సంబరం? 


నేతల కున్నవి రెండు చేతులు

జనుల కున్నవి రెండు చేతులు 


నేతల కున్నవి రెండు కాళ్ళు

జనుల కున్నవి రెండు కాళ్ళు 


జనుల కెందుకింత పేద తనం

నేతల కెందుకంత ధనిక తనం 


ఎలక్షన్లలో  దోచింది తెచ్చి

ఓటర్లను కొనడం నేతల పని 


చిప్పలు పట్టుకుని బిక్షం కొరకు

ఎదిరి చూడటం జనుల పని 


ప్రతి ఐదేండ్లకూ ఇదే తంతూ

ఎన్నడు ఎదిగేను ఈ దేశం

జనులెపుడు చూసేరు

అభివృద్ధి చెందిన భారతదేశం! 


No comments: