అంశం: కలి విడి
శీర్శిక: వివాహ బంధం సాఫీగా కొనసాగాలంటే..
*కలిసి ఉంటే కలదు సుఖం*
*విడి పోతే మిగులును దుఃఖం*
కట్టెలు *మోపుగా* ఉంటే విరువడం కష్టం
అవే *విడి విడిగా* ఉంటే విరువడం తేలిక
ఒకరి కొకరు తోడుగా ఉంటే ఎంతో బలం
ఒంటరిగా ఉంటే నెరవేరు ఎదుటి వారి పంతం
ఎప్పుడూ ప్రయత్నించకు ఉండాలని ఏకాంతం
కలిసి మెలిసి ప్రేమగా గడుపు జీవితాంతం!
నాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి
అందరూ కలిసి మెలిసి జీవించే వారు
ఏ పని అయినా కలిసి చేసుకునే వారు
కష్ట సుఖాలు అందరూ పంచుకునేవారు
ఆనందంగా హాయిగా జీవించే వారు!
నేడు న్యూక్లియర్ ఫ్యామిలీలు
భయం భక్తి పెద్దలంటే గౌరవం జాలి దయా
సంస్కారం సభ్యత ఎక్కడా కానరాదు
ఎప్పుడూ ఇగోలతో జీవితం సాగిస్తున్నారు!
విచ్చల విడి తనం పెరుగుతుంది
కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా
పెద్దల సపోర్ట్ లేక అహాలతో
విడి పోవడానికే ప్రయత్నిస్తున్నారు!
ఏ వివాహ బంధమైనా పచ్చని తోరణంలా
కలకాలం పచ్చగా వర్ధిల్లాలంటే
రెండే రెండింటినీ ఉభయులు పాటించాలి
అవి ఒకటి *సహనం* రెండవది *సర్దుబాటు*!
No comments:
Post a Comment