అంశం: అంతర్జాతీయ మాతృ దినోత్సవం
శీర్షిక: *ప్రత్యక్ష దైవం అమ్మ*
*అమ్మ* అనేది రెండు అక్షరాల పదమే
కానీ ఆ *అమ్మ* లేనిది మనిషికి లేదు *జన్మ*
ఏ స్వార్థం లేనిది సృష్టి కర్త సృజనకు రూపకర్త
జగతిలో దొరుకనిది కమ్మని ప్రేమనే, *అమ్మ!*
నవమాసాలు మోసి కని కంటికి రెప్పలా
తన ఒడిలో లాలించి పాలిచ్చి జోకొడుతూ
వ్రేలు పట్టి నడిపిస్తూ వెన్నుదన్నుగా ఉంటూ
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది!
బిడ్డకు ఏ కష్టం వచ్చినా తనకేనని భావిస్తుంది
ఏ గాయమైనా తనకే తగిలిందనుకుంటుంది
ఏ తప్పు చేసినా తనలోనే దాచుకుంటుంది
ప్రాణానికిప్రాణంగాకాపాడే ప్రత్యక్ష దైవంఅమ్మ!
చిన్న చిన్న కథలు చెబుతూ జ్ఞానాన్ని బోధిస్తూ
చక్కని నడవడికతో అనుభవాలు నేర్పిస్తూ
సంస్కృతి సంప్రదాయాలు సంస్కారం నేర్పించి
ఉన్నా లేకున్నా గొప్ప చదువులు చదివించి ప్రయోజకులను చేసి ఘనంగా పెళ్లిళ్లు చేస్తే!
మీ వేష ధారణ మాట తీరు బాగా లేదనో
కోడలు ఒప్పుకోవడం లేదనో స్థలం లేదనో
పిల్లల చదువులు దెబ్బతింటాయనో
ఫారెన్ లో ఉద్యోగం అక్కడ కష్టమనో
తల్లి దండ్రులను పోషించక పోవడం
అనాధ శరణాలయాలలో వోల్డేజీ హోమ్ లలో వేయడం ఎంత హేయం ఎంత హీనం!
బ్రతికి ఉండగా ఒక్క పిడుచ భోజనం పెట్టక
ఒక్క రోజు సేవ చేయక,చూపు చూడని వారు
వారి వారి గొప్పల కోసం పితృకర్మలుచేస్తే
పుణ్యం కలుగుతుందా? మోక్షం లభిస్తుందా?
రేపటి తరాలకు ఏమైనా ఆదర్శమవుతారా!
రేపు తమకు అదే పరిస్థితి ఏర్పడుతుందని
తమ పిల్లలు అలానే తమను చేయవచ్చనీ
కొడుకులు కోడళ్ళు మనుమలు గుర్తిస్తే
పితృ దోషాలు మహాపాపమని గ్రహిస్తే
నేటి తల్లిదండ్రుల జీవితాలలో
ఓ చిరు దివ్వె వెలిగినట్లే కదా!
ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి అనేది ఉంటుంది
ప్రతి ఒక్కరికీ అంతరాత్మ అనేది ఉంటుంది
కథలు కవితలు పద్యాలు పాటలు
వ్రాసే ముందు నీతులు చెప్పే ముందు
ఒక్క సారైనా ఆత్మ విమర్శ చేసుకుందాం
అమ్మ ఆశీస్సులు తీసుకుందాం!
No comments:
Post a Comment