Sunday, April 20, 2025

ధరిత్రి దినోత్సవం

అంశం: ధరిత్రి దినోత్సవం 

శీర్షిక: దివ్య ధరణి 

నదులు చెరువులు ప్రకృతి పంచభూతాలు 

జలపాతాలు సమస్త జీవకోటి సంరక్షకులు!


పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవాళి పురోగతి 

కాదు కూడదని పట్టించుకోకుంటే అధోగతి 

ప్రతి ఒక్కరికీ కాపాడాలని ఉండాలి మతి 

లేదంటే విషమించుతుంది జీవకోటి పరిస్థితి!


ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ వంటి వస్తువులతో

నదులు సముద్రాలు ఝరుల కాలుష్యం 

వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో

పెరిగి పోతుండే ప్రతినిత్యం ధరణి కాలుష్యం!


ప్రతి సంవత్సరం "ధరిత్రి దినోత్సవం" 

జరుపడమే కాదు కార్యాచరణ ఉండాలి 

పుడమి తల్లిని అందరూ కాపాడాలి 

ఆనందంగా జీవించాలి!


No comments: