Tuesday, April 8, 2025

శృతి మించితే

అంశం: కొత్త లయ



శీర్షిక: *శృతి మించితే*

*పాత ఒక రోత కొత్త ఒక వింత* అన్నట్లు
కొత్త లయ వచ్చినపుడు
పాత లయ రోతగనే కనబడుతుంది
వింతే కదూ...

కొత్త లయ గాలి పటమైతే
దానికి ఆధారం దారం పాత లయే
దారం లేకుండా పతంగి ఎగరనట్లే
పాత లయ లేకుండా కొత్త లయ
మనుగడ సాగించడం అసాధ్యం!

శృతి మించితే లయ తప్పుతుందన్నట్లు
ఏదీ అతి పనికి రాదు ఆవేశం పనికి రాదు
జీవితం లయ తప్పకుండా ఉండాలంటే
స్థిత ప్రజ్ఞత ఆత్మ నిగ్రహం ఎంతో ముఖ్యం!

జీవితంలో శృతి లయలు అన్నీ సహజమే
మానవుడి జీవితం ఉత్కృష్టమైనది
ఏది మంచి ఏది చెడు అనేది
హంస నీటిని పాలను వేరుచేసి నట్లుగా
విభజించి మంచిని స్వీకరించి
చెడును త్యధించడం విజ్ఞుడి లక్షణం!

No comments: