అంశం: హృదయం రాయా? కమలమా?
శీర్శిక: హృదయం అద్దం లాంటిదిహృదయం అద్దం లాంటిది, పగులుతే అతకదు
రాయిలా కఠినమైనది కమలంలా సునిశితమైనది
పంచేంద్రీయాల సమాచారంతో మారుతుంది
మనుషుల గుణాలను బట్టి స్పందిస్తుంది!
మనుషులు మూడు రకాల గుణాల వారుంటారు
సత్వ రజో తమో గుణములు గలవారు
సాత్వికాహారం తీసుకునేవారు సత్వగుణస్థులు
వీరు ప్రేమ దయ జాలి కరుణ కలిగి ఉంటారు!
ఏదైనా తింటూ త్రాగుతూ దైవ చింతన లేనివారు
రజో గుణస్థులు అహం కోపం గర్వముండువారు
ఏ శాస్త్ర నియమం లేకుండా తింటూ త్రాగే వారు
తమో గుణస్థులు వీరు తిట్టడం కొట్టడం చంపడమే!
హృదయ స్పందన అనేది ప్రాంతాలను బట్టి
కాలాలను బట్టి పూర్వ జన్మ కర్మలననుసరించి
తల్లిదండ్రుల పెంపకం గురువులను బోధన
సమాజ తీరును బట్టి మారుతుంది!
సాత్విక తత్వం గల వారైన గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద
వంటి వారల హృదయాలు కమలాల్లా నుండు
వీరి మనసు ఎప్పుడూ ప్రేమ జాలి దయతో మెండు
వీరే నిత్యనూతనంగా చరిత్రలో వెలుగుతారు!
No comments:
Post a Comment