Saturday, April 26, 2025

అంత్యప్రాసాలంకారాలు

 శీర్షిక: అంత్యప్రాసాలంకారాలు 

ముత్యాల హారాలు

(రూపకర్త: రాథోడ్ శ్రావణ్)


నాన్నే నా ప్రాణం
నాన్నే నా ధ్యానం
నాన్నే నా జ్ఞానం
నాన్నే నా చిహ్నం

నాన్ననూ కొనలేము
అమ్మనూ కొనలేము
సోదరినీ కొనలేము
సోదరుడినీ కొనలేము

చెట్లే మనకు శరణ్యం
నీరు పోసిన పుణ్యం
పూజ చేసిన పుణ్యం
చెట్లఫలాలు నాణ్యం

పూజకు తమలపాకులు
గోడలకు ఇనుప మేకులు
ఇంటి కప్పుకు రేకులు
పాదు తొవ్వుటకు సీకులు

మనుషులు పీల్చు గాలి
జంతువులు పీల్చు గాలి
పక్షులు పీల్చు గాలి
కీటకాలు పీల్చు గాలి

ప్రానమిచ్చు తులసి రసం
హాయినిచ్చు చెరుకు రసం
శక్తినిచ్చు తిప్ప రసం
నిద్ర నిచ్చు జాజి రసం

మొక్కలు పెరుగుతుండును
మబ్బులు తిరుగుతుండును
వర్షం కురుస్తుండును
పక్షులు అరుస్తుండును

రామ బాణం గొప్పది
సీత పవిత్రత గొప్పది
కర్ణుడి దానం గొప్పది
హనుమ భక్తి గొప్పది

చిలుక జామపండు తినును
పిల్లి ఎలుకలను తినును
పాప పాయసం తినును
గ్రద్ద పాములను తినును

విరిగిన పాలు త్రాగకు
విరిగిన గాజులు వాడకు
పగిలిన అద్దం చూడకు
మురిగిన పండు తినకు

No comments: