అంశం: ఊసుల రాశుల
శీర్షిక: *కపట ఊసులతో తస్మాత్ జాగ్రత్త!*
*వినీలాకాశంలో తారలెన్ని ఉన్నా ఫలమేమి*
*పున్నమి చంద్రుడు ఒక్కడుంటే చాలు*
*జగతంతా వెలుగే వెలుగు*
*ఊసుల రాశులు ఎన్నున్నా ఏమి ఫలం*
*నిక్కచ్చియైన మాట ఒక్కటైనా ఎంతో క్షేమం*
కనిపించని ప్రేమలు కడుపులో ఎన్నుంటే
ఏమి లాభం
బయటకు వ్యక్త పరిచే ప్రేమ ఒక్కటున్నా చాలు
అది మనసునెంతో శాంత పరుచు!
*కపట ఊసులు "సూదులు"*
*కాదు కాదు అవి "అణు బాంబులు"*
*కుండెడు పాలు విరగడానికి*
*గ్లాసెడు విషం అవసరం లేదు*
*ఒక్క విషపు చుక్క చాలు* అన్నట్లు
కుటుంబాలను రాజ్యాలను
కూలదోయడానికీ రాశుల ఊసులు
అవసరం లేదు
త్రేతాయుగంలో మందర ఒక్క ఊసు చాలు
రాముడు అడవుల పాలు కావడానికి
సీత అపహరించ చూడటానికి
రావణుడు సంహరించబడటానికి
కౌసల్య కైకేయి సుమిత్ర వైధవ్యం చెందడానికి
పూర్వ కాలంలో చెకుముకి రాయితో
నిప్పు పుట్టించే వారు
ఇప్పుడు మాటలతోనే భగ్గున మండే
అగ్గి మంటలు పుట్టిస్తాన్నారు
ఇక ద్వాపరయుగంలో శకుని
రాశుల ఊసులతోనే కాదు
కంటి సైగలతో జూదంలో ధర్మరాజుతో సహా
పాండవులను ఓడించి ద్రౌపదిని అవమానించి
పాండవులను అరణ్యవాసం అజ్ఞాతవాసం పంపించి
కురుక్షేత్ర యుద్ధంలో కురు వంశ నాశనానికి
కారకుడయ్యాడు
త్రేతాయుగం ద్వాపరయుగంలోనే
అలాంటి సంఘటనలు ఉన్నప్పుడు
ఇది కలియుగం *కపట ఊసులతో తస్మాత్ జాగ్రత్త!*
No comments:
Post a Comment