అంశం: *పోస్ట్ మ్యాన్*
శీర్శిక: *పోస్ట్ పోస్ట్*
ట్రింగ్ ట్రింగ్ మంటూ సైకిల్ బెల్ కొడుతూ
పోస్ట్ పోస్ట్ అంటూ పిలుపు వినగానే
ఆహా! ఆ అనుభూతి మరువలేనిది
ఆ ప్రేమాప్యతలు చెరిగి పోనివి!
పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే ఏమో తెస్తాడు
అది ఉత్తరమో రిజిస్టర్ పోస్టో పుస్తకమో
ఏదైననూ భద్రంగా సంచిలో వేసుకుని
చంకకు వేసుకుని తిరుగుతుంటాడు రోజూ!
వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ
ఎంత దూరమైనా రయ్ రయ్ మంటూ
సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ
పలుకరిస్తాడు ఉత్తరాలను బట్వాడా చేస్తూ
అవసరమైన వారికి చదివి వినిపించు!
పోస్ట్ మ్యాన్ కు తెలియని ఇల్లంటూ ఉండదు
తెలియని వ్యక్తీ తెలియని దారీ ఉండదు
అంతే కాదండోయ్ ఎవరు ఎలాంటి వారో
పసిగట్టగల సత్తా పోస్ట్ మ్యాన్ కు ఉంటుంది!
ఒక్క మాటలో చెప్పాలంటే పోస్ట్ మ్యాన్
చేసేది పోస్ట్ మ్యాన్ చిరు ఉద్యోగమే అయినా
కుటుంబంలో ఒక సభ్యుడికంటే అధికగౌరవం
మర్యాద ప్రేమ అభిమానం ఉండేది నాడు
పోస్ట్ మ్యాన్ కు తెలియని ఇల్లంటూ ఉండదు
తెలియని వ్యక్తీ తెలియని దారీ ఉండదు
అంతే కాదండోయ్ ఎవరు ఎలాంటి వారో
పసిగట్టగల సత్తా పోస్ట్ మ్యాన్ కు ఉంటుంది!
ఒక్క మాటలో చెప్పాలంటే పోస్ట్ మ్యాన్
చేసేది పోస్ట్ మ్యాన్ చిరు ఉద్యోగమే అయినా
కుటుంబంలో ఒక సభ్యుడికంటే అధికగౌరవం
మర్యాద ప్రేమ అభిమానం ఉండేది నాడు
ఏవీ ఆ మధురాతి మధుర జ్ఞాపకాలు నేడు!
No comments:
Post a Comment