శీర్షిక: *బంధాలు - బంధుత్వాలు*
డబ్బు ముఖానికి వేసుకునే మేకప్ వంటిది
ధనం సంపద ఆహార్యం అనేవి తాత్కాలికం
సంపద వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది
ఫోటోల కోసం డబ్బు పంచే వారు బంధువులు కారు
ఏ ఆపద వచ్చినా నిస్వార్థంగా అహం లేకుండా
ఆదుకునేవారే నిజమైన బంధువులు
బంధాలు బంధుత్వాలే ఎప్పటికీ శాశ్వతం!
బంధాలకు బంధుత్వాలకు ముఖ్యం డబ్బు కాదు
మనిషిలో నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ
నిస్వార్ధం మంచి మనసు మాట తప్పని తనంతో
ధర్మంగా ఉండేవారికి ఎప్పుడూ ఉంటుంది గౌరవం!
హైదరాబాద్ ముంబాయికి ఎంతదూరమో
ముంబాయి హైదరాబాద్ కు అంతే దూరం
డబ్బున్న వారు పేదవారిని ఎంత దూరం పెడుతారో
పేదవారు దనవంతులను అంతే దూరం పెడుతారు!
డబ్బు మనిషిలో గర్వం అహంకారాన్ని పెంచుతుంది
ఆ గర్వం అహంకారం వారికి తెలియకుండానే
వారి చుట్టూరా ఒక అగ్ని వలయాన్ని ఏర్పరుస్తుంది
ఆ అగ్ని వలయం లోపల వారే బంధీలై పోతారు!
ఓడలు పోయి బండ్లు అవుతాయి
బండ్లు పోయి ఓడలు అవుతాయి
చరిత్రలో ఎన్ని చూడలేదు సజీవ సాక్ష్యాలను
అందం ఆహార్యం ఆయుష్షు డబ్బు సంపదలు
అవి ఏవీ ఈ జగత్తులో శాశ్వతం కావు!
డబ్బు పోయినను బికారి అయినను
ఆ గర్వం అహంకార వాసన అంత సులభంగా పోదు
అప్పుడు గుర్తుకు వస్తాయి బంధాలు అనుబంధాలు
చేయి కాలినాక ఆకులను పట్టుకుంటే ఫలమేమి!
దేవుడి ముందు మానవులు నిమిత్తమాత్రులు
మనిషి ఎంత గొప్ప వాడైనా ఎంత తెలివి ఉన్నా
ఎన్ని రంగులు మార్చినా ఎన్ని ప్లానులు వేసినా
ఎన్ని కోట్లు సంపాదించినా ఎందరిని దూరం పెట్టినా
తుది తీర్పు దేవుడిదే ఇది నగ్న సత్యం
నిత్యం జీవితంలో ఇది గమనిస్తూ ఉండాలి!
No comments:
Post a Comment