Saturday, April 19, 2025

మధుర స్మృతులు

శీర్షిక: *మధుర స్మృతులు*


ఆడుతూ పాడుతూ ఎగురుతూ గడిపే 

అందమైన ఆహ్లాదకరమైన  రోజులవి

ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీసే 

కల్లాకపటం ఎరుగని కాలం అది!


ఏడు నుండి పదో తరగతి స్కూలుచదువులు 

మా ఊరు సూరి పెళ్లి నుండి నెక్కొండకు 

రోజు వెళ్ళాలి రావాలి అదీచెప్పులు లేకుండా 

రానూ పోనూ ఎనిమిది కిలోమీటర్ల దూరం!


మా ఫ్రెండ్ మాస్కల్ ముస్లీం అబ్బాయి 

వారి నాన్న ఒకటి రెండవ తరగతిలో చెపరాసి

ప్రతి నిత్యం మాస్కల్ ఇతర మరికొంత మంది 

స్నేహితులతో నెక్కొండకు నడిచి వెళ్ళేవాళ్ళం!


అప్పుడే మామధ్యలో ఒక ఒప్పందం కుదిరే

నేను దారిలో మా ఫ్రెండ్ కు తెలుగు నేర్పాలి 

అదే విధంగా నాకు ఆ ఫ్రెండ్ హిందీ నేర్పాలి 

అతను చెబుతుంటే నేను గట్టిగా పలకాలి!


ఏక్ దో తీన్ నుంచి పచ్చీస్ వరకు అంకెలు 

హిందీ పదాలు వాటి అర్థాలు వాక్యాలు 

చక్కగా సులభంగా సునాయాసంగా నేర్పాడు 

అలానే నేను తెలుగు అంకెలు తెలుగుపదాలు 

వాక్యాలు అలతి అలతి పదాలతోనేర్పించాను 

ఉభయుల కోరికలుతీరాయి కలలుఫలించాయి

అవి నేటికీగుర్తున్నాయి ఆ మధుర స్మృతులు!

No comments: