అంశం: యువత సమస్యలు
శీర్షిక: *పుండొక చోట ఉంటే మందొక చోట*
*కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు*
యువత సమస్యలకు కారణాలు అనేకం
చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటాయి
సవరించుకునే లోపే జీవితాలాగమై పోతున్నాయి!
కురుక్షేత్రం యుద్ధంలో ద్రోణుడు రచించిన
పద్మవ్యూహం లోకి ధీరుడు అభిమన్యుడు
పోగలిగాడు గానీ తిరిగి రాలేక
అందులోనే చిక్కి వీరమరణం పొందాడు!
అలానే ఉంది నేడు యువత పరిస్థితి
యువతీయువకులు అందరూ అభిమన్యులే
తల్లిదండ్రులు గురువులు సమాజం వలన
ప్రభుత్వ విధానాలు సోషల్ మీడియా
చెడు స్నేహాలు ఫారెన్ కల్చర్ చట్టాలు చదువులు
ఇలా అనేక కారణాల వలన నేడు యువత
ప్రమాదకర విషవలయంలో చిక్కుకుని
బంధీలవుతున్నారు!
కొందరు తల్లిదండ్రులుక్రమశిక్షణతో లేకపోవడం
పిల్లలను సరియైన పద్దతిలో పెంచక పోవడం
చరవాణీలను వైఫైల బైక్ లను అదుపులో పెట్టక
హోదా కోసం కొనివ్వడం సమస్యలకు కారణం!
*పుండొక చోట ఉంటే మందొక చోట* లాగా
పిల్లలు ఏమి చేస్తున్నారో ఎటుపోతున్నారో
పట్టించుకోకుండా అంతా యువతదే తప్పంటూ
*చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు*
తరువాత ప్రయోజనం ఏమి ఉంటుంది?
జీవితాలకుఉపయోగపడే విద్యనుబోధించాలి
ఆన్లైన్ బెట్టింగ్ ఆప్ లను రద్దు చేయాలి
మధ్యం డ్రగ్స్ చెడు కల్చర్ అదుపులో పెట్టాలి
యువతకు స్వేచ్ఛ నిస్తూనే నియంత్రణలో పెట్టాలి
ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచాలి
తల్లి తండ్రులు గొప్పలకు పంతాలకు పోకుండా
ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచాలి
తల్లి తండ్రులు గొప్పలకు పంతాలకు పోకుండా
పిల్లలకు ఇష్టమైన చదువులనే చదివించాలి
ఆదర్శంగా జీవిస్తూ క్రమశిక్షణతో పెంచాలి!
ఆదర్శంగా జీవిస్తూ క్రమశిక్షణతో పెంచాలి!
No comments:
Post a Comment