అంశం: కాలంతో చెలగాటం
శీర్శిక: *కత్తితో సాము లాంటిది*
*కాలంతో చెలగాటం కత్తితో సాము లాంటిది*
అంటారు పెద్దలు
"కాలాన్ని" దేనితోనూ పోల్చ వీలుకాదు
కాలం స్వచ్ఛమైన ప్రవాహం
అందులో గులక రాళ్ళు
జీవ కోటి ప్రాణులు ప్రాణ రహితాలు
కాలానికి ముగింపు లేదు!
కాలం విలువైనది శక్తి వంతమైనది
కాలంతో చెలగాటమంటే
నిప్పుతో తల గోక్కున్నట్లే
కాలంతో జాగ్రత్తగా ఉండాలి!
భూభ్రమనం భూపరిభ్రమనం వలన కాలం
పగలు రాత్రులతో నిరంతరం సాగిపోయేది
కాలాన్ని అదుపు చేయడం అసాధ్యం
కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి
సమయం గడిచిందా..మల్లీ తిరిగి రాదు!
కాలంలో మార్పులను బట్టి
ఎండాకాలం వర్షాకాలం చలికాలంగానూ
భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గానూ
ఋతువులు మాసాలు గానూ నిర్ణయించారు!
కాలం ఎవరి కోసం ఆగదు
ఎవరి కోసమనో దాగదు
మనిషి బ్రతికి ఉన్నప్పుడు
మనిషి విలువ తెలియదు
అతను ఆమే లేనప్పుడు తెలుస్తుంది!
అలానే సమయం ఉన్నప్పుడు
సమయం విలువ తెలియదు
పరీక్షలకు ఆలస్యమైనపుడో
ఇంటర్వ్యూకు ఆలస్యమైనప్పుడో
ప్రయాణం చేసే ట్రేయిన్ ఆలస్యమైనప్పుడో
హాస్పిటల్ కు పోవడం ఆలస్యమైనప్పుడో
సమయం విలువ తెలుస్తుంది!
కాలంతో మనిషి వయసు పెరుగుతుంది
ఆయుష్షు తగ్గుతూ ఉంటుంది
కాలాన్ని బట్టే బాల్యం యవ్వనం వృద్ధాప్యం
వయసులు మారుతూ ఉంటాయి!
ఏ వయస్సులో చేయాల్సినవి
ఆ వయస్సులోనే చేయాలి
కష్టసుఖాలు అనుభవించాలి
మంచి పనులు చేస్తూ ఆయుష్షున్నంత వరకు
ప్రతి నిమిషాన్ని ప్రణాళికలతో నడుచుకుంటూ
సంతోషంగా తృప్తిగా జీవించడమే
మనిషి చేతిలో ఉన్న గొప్ప వరం కాలం!
No comments:
Post a Comment