Thursday, April 10, 2025

ఆనందాల ప్రగతి

*నేటి అంశం*మినీ కవిత*

*హరివిల్లు*
*విరి జల్లు*
*పచ్చటి పందిరి*
*అందాల జగతి*

శీర్షిక: *ఆనందాల ప్రగతి*

అరుణోదయ కాంతిలో ఎత్తెన కొండలు
మత్తెక్కించే నీలిమేఘాలు
పచ్చని తరువులు మనోహర జలపాతాలు
*అందాల జగతి*  "ఆనందాల ప్రగతి"
నిత్య నూతనంగా పచ్చని తోరణంగా
సప్త శోభిత వర్ణాలతో ప్రకాశించాలి
కలకాలం  *హరివిల్లు* లా

ఆడాలి పాడాలి అమ్మా నాన్నలు
పసి పిల్లల జోలపాటలు
కురియాలి ఆ ఇంట నిత్యం *విరి జల్లు* లు

పిండి వెన్నెల జాబిలిలో కళకళ లాడాలి
అన్యోన్యంగా సుఖసంతోషాలతో కుటుంబాలు
*పచ్చటి పందిరి* లో మూడు పువ్వులు
ఆరు కాయల చందాన

No comments: