Sunday, April 6, 2025

అబ్బబ్బ పాలన

అంశం: సమాజ సేవ


శీర్షిక: *అబ్బబ్బ పాలన*

సీ .ప:
అబ్బబ్బ పాలన నబ్బురముగ నుండే
భగభగ ధరలన్ని భగ్గుమనెను
గబగబ నాయకుల్ గుబులును రాజేసి
బుస్సుబుస్సుమనుచు బుసలు కొట్టె
దడదడ గూండాలు బడితపూజలు జేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బులాగె!


ఆ.వె:
విస్కి విస్కీ యంటు వింతలు జేయుచు
గుట్టు చప్పుడుగను గూడు కూల్చి
వొట్టు పెట్టి తట్టి వోట్లను లాగిరి
సేవ యిదియెననిరి సేదతీరి !

  

No comments: