అంశం: నాలో నేను
శీర్షిక: *ఎంత కాలం బంధీగా ఉంటావ్?*
*ఈ విశ్వంలో ఆకాశం అనంతం*
*భూమిసువిశాలం పంచభూతాలుఅపరిమితం*
*ప్రకృతి నదులు తరులు ఝరులు కోకొల్లలు!*
నాలో నేను నా ఇష్టం నేను
నా ఇంట్లో నేను నా గడపలో నేను
నా చదువేంటో నాది నా బ్రతుకేంటో నాది
నా జీవితం నా ఇష్టం అంటే ఎలా?
ఇదేనా జీవితమంటే
ఎనుబది నాలుగు లక్షల జన్మలలో
మానవ జన్మ ఉత్తమమైనది ఉత్కృష్టమైనది
*ఈ లోకంలో ఎవరికి వారే యమునా తీరే*
అంటే ఎలా?
మనిషి సంఘ జీవి
సమాజంలో నలుగురితో కలిసి జీవించాలి
మనిషి ఎడారి జంతువు కాదు
నీరు లేని ఎడారిలో ఒంటరిగా జీవించడానికి!
*నేను, నాది* అనే సంకుచిత భావాలు
స్వార్ధ చింతన వదిలి
*మేము, మనం* అనే విశాల హృదయంతో
మనసును పెద్దదిగా చేసుకుని
బయటి ప్రపంచంలోకి రావాలి...
ప్రకృతిని జీవకోటిని పచ్చిక బయళ్ళను
ఆస్వాదిస్తూ హాయిగా జీవించాలి
నాలుగు గోడల మధ్య
*ఎంత కాలం బందీగా ఉంటావ్*
నూతిలో మండూకంలా ఉండి ఏమిసాధిస్తావు!
దానిని జీవితం అంటారా!
ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రతి మనిషికి యదేచ్చగా జీవించే
విద్యను నేర్చుకునే డబ్బు సంపాదించుకునే
తమ మభావాలను వ్యక్త పరిచే
స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది!
*నేను నా* అనే అహం ఉన్నంత కాలం
నీ తప్పులు నీవు తెలుసుకో లేవు
నీవు అద్దంలో చూసుకుంటే నీ మొఖమే
కనబడుతుంది నీ వెన్ను నీకు కనబడదు
నీవు చేసిన తప్పులు నీ మనసు అద్దంలో కనబడవు
వాటిని ఒప్పులుగా సమర్ధించుకుంటావు
*నాలో, నేను* అనే బంధీ నుండి బయటకు రా
*మనలో, అందరం* అంటూ
ఈ సువిశాల ప్రపంచంలో ఆనందంగా
తృప్తిగా ప్రశాంతంగా జీవించు!
No comments:
Post a Comment