*నేటి అంశం : *మా ఊరు*
శీర్షిక: మా ఊరు
పచ్చని పొలాలు పారేటి వాగులు
ఎత్తైన వృక్షాలు యెటను జూడ
మట్టి గోడలయిండ్లు మానవీయ జనులు
కష్టించు కార్మిక కర్షకులును
కలివిడి మనుషులు కమనీయ మమతలు
పంటలు పండించు గుంట భూమి
పండుగ లొచ్చిన పరవసమొందేరు
కష్టాలు వచ్చిన కలిసి యుంద్రు!
సూరిపెల్లి మాది చురుకైన యువకులు
ఊరు చిన్న దైన జోరు కల్లు
చుట్టు చెరువులుండు చెట్టుపుట్టలు నుండు
ఓరుగల్లు జిల్ల పోరునెల్ల!
పల్లెల భూముల్లొ పండించు రైతులు
పాడిపంటలు చాల పల్లెలందు
కాయగూరలుతాజ కందాయ ఫలములు
పుష్టిగ పండును పురముబంప
శ్రమకోర్చు యువకులు శక్తినింపుకొనియు
సిద్ధము నుందురు సేద్యమునకు
పల్లెసీమలుదేశ పట్టుగొమ్మలు నేడు
సాధించ వలయును జగతి నంత!
ప్రకృతి తాండ వించు పల్లెసీమల నందు
స్వచ్ఛ గాలి యుండు జలము నిండు
అలసట మరిచేరు హాయిగా నుండేరు
పేద రికములైన పెద్ద మనసు!
No comments:
Post a Comment