Thursday, April 17, 2025

ఆనందంగా జీవిద్దాం /దూరాలను చెరిపేద్దాంP

అంశం:ఆనంద జ్యోతి

శీర్షిక: *ఆనందంగా జీవిద్దాం*

*నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా*
*కళకళ లాడే సంసారాలను*
*మనిషి అత్యాశతో*
*ఈర్ష్యఅసూయలతో*
*ఆనందాలు కోల్పోతుండే*
*డబ్బు అహంతో సర్వం కోల్పోతూ*
స్వయంకృతాపరాధంతో సాగిపోతుండే!

ప్రపంచీకరణతో ప్రపంచం కుగ్రామమాయే
యాంత్రిక జీవితానికి అలవాటు పడి
డాలర్ల మోజులో పడి తల్లిదండ్రులను విడిచి
ప్రేమలకు బంధాలకు దూరమవుతుండే
బాధ్యతలను మరిచి పోతుండే!

అమెరికా లండన్ గంటలలో చేరుకోగలినా
కానీ కూసింతదూరంలో ఉన్న అమ్మానాన్నల
తోబుట్టువుల బంధు మిత్రులను
నెలలు కొలది ప్రయాణించినా 
చేరుకోలేక పోతుండే!

ఈ సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టం
చదువు ఉద్యోగం హోదా పెళ్లి విజయం
డబ్బు అన్నియు జీవితంలో ఒక భాగం
అవే జీవితం అని అనుకోవడం అజ్ఞానం!

మనిషి వెతకాల్సింది హాయి సుఖమా?
సంతోషం ఆనందం తృప్తి కొరకు తపించు
ఇవి మాతృమూర్తులతో భార్యా పిల్లలతో తోబుట్టువులతో బంధుమిత్రులతో
కలిసి మెలిసి ప్రేమాప్యాయతలతో
దయ కరుణ జాలితో ఉంటేనే లభించు!

కనుల ముందున్న దైవాలు
తల్లిదండ్రుల మరిచి
కానరాని కోవెలలో ఉన్న దైవాల వెంట
పరుగెత్తడం మాని!

ఈర్ష్య అసూయలు ఇగోలు పంతాలు వీడి 
అమ్మా నాన్నలతో భార్యా పిల్లలతో
తోబుట్టువులతో స్నేహితులతో కలిసి
ఆనందంగా ఆదర్శంగా తృప్తిగా జీవిస్తూ
ఆనందజ్యోతిని వెలిగించు!

No comments: