Monday, April 14, 2025

ఏది బంధు పధకం

శీర్షిక: ఏది కూలి బంధు పధకం?


ఏడు పదులు దాటిన రిజర్వేషన్లకు వలే

ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు 

వారు అది అని వారు ఇది అని 

వారు లేకుంటే పూట గడువదనీ

పధకాల కొరకు తెగ బాధ పడుతారే!


పని చేసే కూలీలు శ్రమ జీవులు కారా

కనీసం వారికి అడుగు భూమి కూడా లేదే 

వారు లేకుంటే పంటలు పండుతాయా?

ఏది వారికి కూలి బంధు పధకం?


కౌలు దారులు శ్రమ జీవులు కారా 

కనీసం వారికి సెంటు భూమి లేదే

వారు దున్నకుంటే ధాన్యం పండుతుందా?

ఏది వారికి కౌలు బంధు పధకం?


అడ్డ కూలీలు శ్రామికులు కారా 

కనీసం వారు ఉండడానికి ఇల్లు లేదే

వారు లేకుంటే నిర్మాణాలు జరుగుతాయా?

ఏది వారికి అడ్డ కూలి బంధు పధకం?


కంపనీలలో కార్మికులు శ్రమ జీవులు కారా 

ఎప్పుడు ఊడుతదో తెలియని ధీన స్థితి 

వారు లేకుంటే ఉత్పత్తి జరుగుతుందా?

ఏది వారికి కార్మిక బంధు పధకం?


రిటైల్ ఇన్వెస్టర్లు శ్రమ జీవులు కారా 

ఎప్పుడు మార్కెట్ పడుతుందో తెలియదు 

లక్షల్లో నష్టపోతారు రోడ్డున పడుతారు 

వారు లేకుంటే ఆర్ధిక వ్యవస్థ ఉంటుందా?

ఏది వారికి ఇన్వెష్టర్ల పధకం?


చిల్లర వ్యాపారులు శ్రమ జీవులు కారా 

మాల్స్ డిమార్ట్ మెట్రో షాప్ లు

ఆన్లైన్ బిజినెస్ లు వచ్చాకా 

రోడ్డున పడ్డ వారు శ్రామికులు కారా 

వారు లేకుంటే జనులు జీవించ గలరా?

ఏది వారికి చిల్లర వ్యాపారుల పధకం?


గౌడ కురుమ పద్మశాలి గొల్ల బెస్త దోబీ

బ్రాహ్మణి  నాయిబ్రాహ్మణి వైష్ణవులు 

అయ్యవారులు కంసాలి  వడ్రంగి బహుజన

ఇతర వృత్తుల వారు వారు శ్రామికులు కారా 

వారు లేకుంటే ప్రజలు బ్రతుక గలరా?

ఏది వారికి ఆయా వృత్తుల పధకాలు?


నిద్ర ఆహారాలులేకుండా భార్యా పిల్లలవిడిచి

కొండలలో లోయలలో ఎడారులలో ఉంటూ

దేశాన్ని రక్షిస్తున్న సైనికులు శ్రామికులు కారా 

వారు లేకుంటే ప్రజలు మనుగడ సాగిస్తారా?

ఏది వారికి సైనిక పధకం?


ఆలోచించాలి నేతలు ఆలోచించాలి కవులు 

ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి 

అన్నివృత్తుల సేవలు సమాజానికి అవసరమే

ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు 

స్వస్తి పలుకాలి 

నవసమాజ నిర్మాణానికి కృషి సల్పాలి 

అందుకు ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలి!!


No comments: