అంశం:- విజయదశమి (దసరా)
శీర్షిక:- *విజయానికి ప్రతీక విజయ దశమి*
*భారతదేశంలో హిందువులకు దసరా పండుగ గొప్ప వేడుక...*
*ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకు...*
*నవరాత్రులు రోజుకో రూపంలో పూజా నైవేద్యాలతో కొలిచేరు దుర్గాదేవిని...*
*భక్తిశ్రద్ధలతో పూజించిన కోరిన కోరికలు తీర్చునని భక్తులు నమ్మేరు..*
*నవమి రోజు మహిషాసురుడనే రాక్షసుడిని వధించే చండీ రూపంలో...*
*దశిమి రోజున చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా జరిపేరు దసరా...*
*విజయదశమి రోజు పిల్లలు పెద్దలు ఉషోదయాన లేచి...*
*తలంటు స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించేరు...*
*ఇష్టదైవాలకు నిష్టగా ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసేరు...*
*పాండవులు అజ్ఞాతవాసం వీడి వచ్చాక పూజలు చేసి...*
*వారు జమ్మిచెట్టుపై దాచిపెట్టిన అస్త్రశస్త్రాలు చేపట్టినరోజు విజయదశమిగా...*
*శ్రీరాముడు పదితలల రావణాసురుని సంహరించిన రోజుగా...*
*విజయోత్సవాలు జరుపుకునేరు ప్రజలు సంతోషంగా ఆనందంగా గడిపేరు...*
*గ్రామాలలో సాయంకాల సమయంలో చావడిలో ఆయుధపూజ చేసి..*
*కంకణాలు ధరించి సోరకాయను గొర్రెపోతును బలి ఇవ్వడం ఆనవాయితీ...*
*తదుపరి జమ్మివృక్షం వద్దకు వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి...*
*జమ్మి ఆకులను బంగారంగా భావించి, పెద్దల చేతుల్లో పెట్టి...*
*ఆశీర్వాదం తీసుకోవడమనేది పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం...*
*పిదప శివార్లలో పాలపిట్ట దర్శనంతో విజయదశమి సుసంపన్నం...*
*పట్టణాలలో రావణుడి దహన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగు...*
No comments:
Post a Comment