అంశం: పితృదేవోభవ!
**********************
శీర్షిక: *నాన్నంటే ధైర్యం*
**********************
నాన్నంటే ప్రేమ! నాన్నంటే రక్షణ! నాన్నంటే ధైర్యం!
నాన్నంటే భయం! నాన్నంటే త్యాగం!నాన్నంటే ఆదర్శం!
నాన్నంటే బాధ్యత! నాన్నకు నాన్నేసాటి! నాన్నకు ఎవరులేరు మేటి!
నడక నడత నేర్పేది నాన్నే! భవిత బాసట నిచ్చేది నాన్నే!
గమ్యానికి చేర్చేది నాన్నే !జీవిత పాఠాన్ని నేర్పేది నాన్నే!
క్రొవ్వొత్తిలా కరిగిపోయేది నాన్నే! కొనఊపిరివరకూ భాద్యత వహించేదీ నాన్నే!
అమ్మ శిషువును కడుపున మోస్తే, నాన్న తన గుండెలో మోస్తాడు!
జన్మ నిచ్చేది అమ్మైతే, జీవితాన్ని పంచేది నాన్ననే!
వేలుపట్టి నడిపించేది నాన్నానే ప్రపంచానికి వెలుగెత్తి చాటేది నాన్ననే!
అమ్మ కమ్మని పాలుపడితే నాన్న తన జీవితాన్నే త్యాగంచేయు!
అమ్మ ఇంటిని చూపిస్తే నాన్న ప్రపంచాన్నే చూపించు!
కరుణ యున్న కారణ్యమున్నా బాధ కలిగినా, సంతోషం కలిగినా!
కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా తనగుండెల మాటునే దాచిపెట్టు!
నాన్న కోపానికి అర్ధం బాధ్యత నాన్న బాధకు అర్ధం బాధ్యత!
కుటుంబ బాధ్యత మోయుచుండు కానీ దానినెవరికీ కనిపించ నివ్వకుండు!
నాన్న ఆలోచనలు అనిర్వచనీయం నాన్న వ్యక్తిత్వం ఆదర్శనీయం!
నాన్న ముఖం నవరసాల ప్రతిబింబం నాన్న దూరదృష్టి మహోన్నతమైనది!
అది ఎంతో మందికి స్పూర్తిదాయకం, నాన్న మనసు చల్లని హిమపర్వతం!
తూలుతూ రగులుతూ కరుగుతూ రాల్లు రప్పలు ఎన్ని ఎదురైనా!
నిరంతరం సాగే జీవనది నాన్న! నాన్నంటే ధైర్యం నాన్నంటే ప్రాణం!
No comments:
Post a Comment