Thursday, April 10, 2025

మనిషికి మనిషే శత్రువా?

తేది:10.04.25

అంశం: మనిషికి మనిషే శత్రువా?

శీర్శిక: *అరిషడ్వర్గాలే శత్రువులు*

సృష్టిలోనే ఒక జీవికి
మరో జీవిని ఆహారంగా ఇచ్చాడు సృష్టి కర్త
అది సృష్టి జీవ రహస్యం
దానిని ఛేదించడం అంటే
మరో జన్మ ఎత్తడమే!

ఒకరు గెలువాలంటే 
మరొకరు ఓడాలి అన్నట్లుగానే
ఒక ప్రాణి ప్రాణం మరొక దానికి ఆహారం!

కప్పలకు క్రిమి కీటకాలు ఆహారం
కప్పలు పాములకు ఆహారం 
పాములు డేగలకు  ఆహారం
ఎలుకలు పిల్లులకు ఆహారం!

ఇలా ఒకదాని కొకటి ఆహారంగా
సృష్టించ బడ్డాయి!
అంత మాత్రాన ఒకదాని కొకటి
శత్రువు అనుకోవడం అవివేకం!

ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మనిషి జన్మ ఉత్కృష్టమైనది
ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం
భగవంతుడు మనిషికి ఇచ్చాడు!

హంస పాలను నీటిని వేరు చేసి నట్లుగానే
మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో గ్రహించి
దూరం పెట్టాలి!

మనిషికి స్నేహితులు విరోధులు 
అంటూ వేరే ఎవరూ లేరు
తనలోని కామక్రోధమోహ లోభ మద
మాత్సర్యాలను అరిషడ్వర్గాలే శత్రువులు 
వాటిని జయించ గలుగుతే అందరూ మిత్రులే

ప్రతి ఒక్కరూ సాటి వారిపై కోపం అహం
ఈర్ష్య అసూయలను చూపించకుండా
ప్రేమ దయ జాలి కరుణ మమతలు చిరునవ్వు
కలిగి ఉంటే ఏ మనిషికి మరోమనిషి శత్రువే కాదు
అది కేవలం మన మనోస్థితి!

No comments: