అంశం: జల గీతాలు
శీర్షిక: *చుట్టూరా సముద్రాలే*
పల్లవి:
దేశం నిండా చెరువులు నదులే....
దేశం చుట్టూరా సముద్రాలే....
జనులకు త్రాగు నీరే కరువులే ... "దేశం"
చరణం:01
జగతిలో మూడొంతుల నీరున్నా...
ఒక వంతే భూమున్నా.....
ఒక శాతమే త్రాగు నీరూ....
మిగిలినది పనికి రాదూ...... "దేశం"
చరణం:02
నీరే జీవనాధారమూ...
నీరు లేక బ్రతక లేమూ...
వర్షమే మూలాధారమూ...
తెలుసుకోవాలి మనందరమూ..... "దేశం"
చరణం:03
నీటి కొరకే రాజ్య నేతలూ...
జల యుద్దాలు చేస్తారూ...
ఒప్పందాలు చేసుకుంటారూ....
విభేదాలొస్తే రద్దు చేస్తారూ... "దేశం"
చరణం:04
నీటిని పొదుపుగ వాడాలీ...
ఇంకుడు గుంతలు త్రవ్వాలీ....
వృధా చేయడం మానాలీ....
అందరు సమానంగా వాడాలీ... "దేశం"
No comments:
Post a Comment