అంశం: తీర్పు దేవునిదా? మనదా?
శీర్శిక: *అంతిమ తీర్పు దేవుడిదే*
విశ్వంలో ఆస్తికులు నాస్తికులు న్యూట్రల్స్
అను మూడు రకాల మనుషులు ఉన్నారు
దేవుడిని నమ్మేవారు *ఆస్తికులు*
దేవుడిని అసలే నమ్మని వారు *నాస్తికులు*
దేవుడున్నాడో లేడో అనే వారు *న్యూట్రల్స్*!
*ఆస్తికులు* తీర్పు దేవుడిదే అంటారు
*నాస్తికులు* తీర్పు మానవుడిదే అంటారు
*న్యూట్రల్స్* ఏమో అని సందిగ్ధంలో ఉంటారు
తప్పొప్పులు చెప్పే సాహసం ఎవరూ చేయలేరు!
ఆపదలో ఉన్న వారికి వారిని అదుకునే
మనిషే ప్రత్యక్ష దేవుడు
అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నవారిని
బ్రతికించే డాక్టర్ ప్రత్యక్ష దైవం
చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి
కూర్చున్నాడంటే అది దేవుడే అంటారు!
తీర్పు దేవునిదా? మనదా? అంటే
ఒక ఆస్తికుడిగా
దేవుడి ముందు మనం నిమిత్త మాత్రులం
దేవుడి సృష్టించిన ఈ చరచర జీవకోటి
చదరంగంలో లేదా కైలాస పఠంలో పావులు!
తాత్కాలికంగా మనిషి తీర్పు ఇచ్చినా
అంతిమ తీర్పు దేవుడిదే అవుతుంది
జీవులను సృష్టించే వారు లాలించే వారు
ఆడించే వారు కర్మలను చేయించే వారు
కర్మలు పూర్తయ్యాక తనలో ఐక్యం
చేసుకోవడమో, మరో జన్మసృష్టించడమో
అనేది దేవుడే కార్యమే కదా!
మనుషులు ముఖ్యంగా మూడు రకాలుగా
జీవనం సాగిస్తున్నందున వేరొకరి భావాలపై
తీర్పు చెప్పడం సరికాదు
ఈ రోజు గాక పోయిన ఏదో ఒక రోజు
దేవునితీర్పే తుదితీర్పుఅని నమ్మడంఖాయం!
No comments:
Post a Comment