Tuesday, April 15, 2025

జాతర పాట

అంశం: జాతర: పాట


శీర్షిక: అదిగదిగో చందమామ!

పల్లవి:

అదిగదిగో చందమామ...

జాతరకు వెళ్దామా...

ఆహా...ఓహో... చందమామ...

రాబోయే రోజుల్లో....  

తిరునాళ్ళకు వెళ్దామా ...        "అదిగదిగో"


చరణం:01

అందనంత దూరాన....

తిరుగు తుండు చందమామ... 

తారల నందరిని....

తరుముతూ నుండు......

ఆహా..ఓహో... చందమామ...

అందమైన చందమామా...         "అదిగదిగో"


చరణం:02

మబ్బులడ్డు వచ్చినపుడు...

మాయమై పోతాడు....

మబ్బులు పోగానే....

నవ్వుతు కనిపిస్తాడు....               

ఆహా..ఓహో... చందమామ...

అందమైన చందమామా.....            "అదిగదిగో"


చరణం: 03

నిండు పున్నమి రోజున....

గుండ్రంగా కనిపిస్తాడు.....

నింగికి రాజవుతాడు ....

పండు వెన్నెల కురిపిస్తాడు......

ఆహా ..ఓహో.... చందమామా...

అందమైన చందమామా....              "అదిగదిగో"

No comments: